Site icon NTV Telugu

Heart Attack: పెళ్లికి ఒకరోజు ముందు గుండెపోటుతో వరుడు మృతి.. వధువు పరిస్థితి..!

Heart Attack

Heart Attack

యూపీలో విషాదం చోటు చేసుకుంది. హత్రాస్ జిల్లాలోని భోజ్‌పూర్ ఖెత్సీ గ్రామానికి చెందిన ఓ యువకుడు పెళ్లికి ఒకరోజు ముందు గుండెపోటుతో మరణించాడు. అకస్మాత్తుగా కుప్పకూలడంతో కుటుంబ సభ్యులు జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడ డాక్టర్ చనిపోయినట్లు చెప్పారు. దీంతో.. కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మరోవైపు.. వధువు ఇంట్లోనూ విషాద ఛాయలు అలముకున్నాయి. కాబోయే భర్త మరణవార్త విన్న వధువు అపస్మారక స్థితికి చేరుకుంది.

Read Also: Naga Chaitanya Wedding Card: శుభ లేఖలను పంచుతున్న అక్కినేని ఫ్యామిలీ.. శుభలేఖను చూసారా?

22 ఏళ్ల శివంకు ఆగ్రాలోని బని సింగ్ కుమార్తెతో ఈ రోజు వివాహం జరగాల్సి ఉంది. అయితే ఆదివారం అర్థరాత్రి పెళ్లి సందర్భంగా ఓ కార్యక్రమం జరుగుతోంది. అందులో భాగంగా.. శివం మహారాజా కుర్చీపై కూర్చున్నాడు. అయితే.. ఉన్నట్టుండి ఒక్కసారిగా స్పృహ కోల్పోయి అందులో నుంచి కింద పడిపోయాడు. ఇది చూసి కుటుంబీకులు, బంధువులు భయాందోళనకు గురయ్యారు. కుటుంబ సభ్యులు వెంటనే జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.

Read Also: Modi- Lulada Silva: ప్రధాని మోడీ భుజంపై చేయి వేసి మాట్లాడిన బ్రెజిల్ అధ్యక్షుడు.. (వీడియో)

జిల్లా ఆసుపత్రిలో శివం మరణించినట్లు ప్రకటించినప్పటికీ, ఆశతో అతని కుటుంబం అలీగఢ్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ కూడా డాక్టర్ చనిపోయినట్లు చెప్పాడు. దీంతో.. కుటుంబ సభ్యుల్లో తీవ్ర విషాదం నెలకొంది. దీంతో.. వరుడు మరణంతో పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు ఆగిపోయాయి. వరుడి మృతి విషయం తెలుసుకున్న వధువు కుటుంబీకులు కూడా షాక్‌కు గురయ్యారు. పెళ్లికి వచ్చిన బంధువులు దుఃఖంలో కూరుకుపోవాల్సి వచ్చింది.

Exit mobile version