ఢిల్లీలోని కేసి వేణుగోపాల్ నివాసంలో కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. సంస్థాగత అంశాలతో పాటు, శాఖల వారీగా పనితీరుపై సమీక్ష చేపట్టారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీతో పాటు మంత్రులతో సమీక్ష చేయనున్నారు. ఈ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వ పనితీరుపై చర్చించనున్నారు.
Read Also: Akhilesh Yadav: ఢిల్లీ ఎన్నికల్లో ఆప్‌కు మద్దతు ఎందుకు ఇస్తున్నామంటే..!
ఈ సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, దామోదర్ రాజనర్సింహ, కొండా సురేఖ, సీతక్క, జూపల్లి కృష్ణా రావు పాల్గొన్నారు. శాఖల వారీగా సమీక్షతో పాటు, ప్రతి మంత్రితోనూ ముఖాముఖి భేటీలు నిర్వహించనున్నారు కేసి వేణుగోపాల్. మంత్రి వర్గ విస్తరణ, పిసిసి కార్యవర్గం ఏర్పాటు, తదితర అంశాల పై అధిష్ఠానం నిర్ణయం తీసుకోనుంది.
Read Also: Shridhar Babu: కాళేశ్వర ముక్తేశ్వర దేవాలయాభివృద్ధికి సహకరించండి.. కేంద్రమంత్రికి వినతి