Site icon NTV Telugu

CSK Fan: ఉప్పల్ స్టేడియంలో ఓ క్రికెట్ అభిమానికి చేదు అనుభవం..

Chennai Fan

Chennai Fan

ఐపీఎల్ 2024లో భాగంగా.. నిన్న (శుక్రవారం) ఉప్పల్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ బిగ్ ఫైట్ ను చూసేందుకు ఆరెంజ్ ఆర్మీతో పాటు.. సీఎస్కే ఫ్యాన్స్ కూడా భారీ ఎత్తున వచ్చారు. ముఖ్యంగా ధోనీని చూసేందుకు చాలా మంది అభిమానులు.. వివిధ రాష్ట్రాల నుంచి తరలివచ్చారు. అయితే.. ఈ మ్యాచ్ ను లైవ్ లో చూసేందుకు ఉప్పల్ స్టేడియానికి వచ్చిన ధోనీ అభిమానికి చేదు అనుభవం ఎదురైంది. హ్యాపీగా సీటులో కూర్చుని మ్యాచ్ ను ఎంజాయ్ చేస్తాననుకున్న అభిమానికి చిరాకు కలిగింది.

Read Also: Pakistan Cricket Team: పాకిస్థాన్ ఆటగాళ్లకు స్నైపర్ ట్రైనింగ్.. వీడియో వైరల్

జునైద్ అహ్మద్ అనే వ్యక్తి చెన్నై సూపర్ కింగ్స్​కు వీరాభిమని. ఇక తన ఫేవరట్ టీమ్​ను సపోర్ట్ చేసేందుకు ఉప్పల్ స్టేడియానికి టికెట్ బుక్ చేశారు. ఉప్పల్ స్టేడియంలో తాను పడ్డ ఇబ్బంది గురించి అభిమాని Xలో పంచుకున్నాడు. తాను రూ.4500తో టికెట్ కొనుగోలు చేశానని.. అతనికి J66 సీటును HCA కేటాయించిందని తెలిపాడు. అయితే స్టేడియంలో ఆ సీటే కనిపించలేదని చెప్పాడు. J65 తర్వాత J67 సీటు ఉండటంతో షాకైనట్లు తెలిపాడు. దీంతో చేసేదేమీ లేక.. నిలబడే మ్యాచ్ను చూశానని అభిమాని పేర్కొన్నాడు. అందుకు.. తన డబ్బులు రీఫండ్ చేయాలంటూ అతను Xలో పోస్ట్ చేశాడు. ఇన్నింగ్స్ బ్రేక్లో వెతకగా మరో చోట J66 కనిపించిందని తెలిపాడు.

Read Also: Samyuktha Menon: ఆరేంజ్ కలర్ డ్రెస్సులో అదరగొడుతున్న సంయుక్త..

Exit mobile version