NTV Telugu Site icon

Love Jihad: మతం మారి పెళ్లి చేసుకోవాలని యువతిపై ఒత్తిడి.. ఒప్పుకోకపోవడంతో వీడియోలు వైరల్!

Love Jihad

Love Jihad

ఒడిశాలోని జగత్‌సింగ్‌పూర్ జిల్లాకు చెందిన ఓ మహిళతో లవ్ జిహాద్‌ ఉచ్చులో పడింది. ఆమె సోషల్ మీడియా ద్వారా ఒకరితో పరిచయం ఏర్పడింది. వారిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకోవడం ప్రారంభించారు. ఆ తర్వాత నిందితుడు ఆమెతో శారీరక సంబంధం పెట్టుకున్నాడు. ఈ సందర్భంగా అసభ్యకర వీడియోలు కూడా రూపొందించాడు. మతం మారి వివాహం చేసుకోవాలని ఒత్తిడి చేయడం ప్రారంభించాడు. బాధిత మహిళ దీనిని ఖండించడంతో, వీడియోలు వైరల్ అయ్యాయి. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.

READ MORE: Relationship : మీ లవర్‌లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? జాగ్రత్త!

పోలీసుల సమాచారం ప్రకారం.. నిందితుడిని 24 ఏళ్ల మహ్మద్ సమీర్ మన్సూరిగా గుర్తించారు. అతను బీహార్‌లోని తూర్పు చంపారన్ జిల్లాకు చెందినవాడు. కానీ కాశ్మీర్‌లో ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడు. ఆన్‌లైన్ గేమింగ్ అప్లికేషన్ ద్వారా 2022లో జగత్‌సింగ్‌పూర్ జిల్లాకు చెందిన బాధితురాలితో పరిచయం ఏర్పడింది. ఇద్దరి మధ్య స్నేహం ప్రేమగా మారింది. ఆ తర్వాత నిందితుడు కూడా బాధితురాలిని కలిసేందుకు ఒడిశాకు వచ్చాడు. ఇద్దరూ ఓ హోటల్‌లో కలుసుకున్నారు. ఇక్కడ శారీరకంగా కలిశాడు. ఆమెకు తెలియకుండా నిందితుడు వీడియోలు తీశాడు. కొద్ది రోజుల తర్వాత మతం మార్చి తనను పెళ్లి చేసుకోవాలని బాధితురాలిపై ఒత్తిడి తెచ్చాడు.

READ MORE: Viral Video: మద్యం మత్తులో మరుగుతున్న పాలు మీదపడి వ్యక్తి మృతి (వీడియో)

ఆమె అంగీకరించక పోవడంతో నిందితుడు ఆ అసభ్యకర వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేశాడు. దీంతో బాధితురాలు వెంటనే స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తన తల్లిదండ్రులకు కూడా డబ్బులు డిమాండ్ చేసనట్లు బాధితురాలు పేర్కొంది. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని విచారణ నిమిత్తం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు తరలించారు. నిందితుడి నుంచి పాన్ కార్డు, ఆధార్ కార్డుతో పాటు మరికొన్ని పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో ‘లవ్ జిహాద్’ అంశంపై డీసీపీ మాట్లాడుతూ.. పోలీసులు వివిధ కోణాల్లో కేసును దర్యాప్తు చేస్తున్నారని, నిందితుడికి ఇతర మహిళలతో గతంలో సంబంధాలు ఉన్నాయా లేదా అనే అంశాలపై కూడా విచారిస్తున్నామన్నారు.

Show comments