NTV Telugu Site icon

Hyderabad: మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డిపై కేసు నమోదు..

Katasani

Katasani

అమీన్‌పూర్‌లో మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌ రెడ్డిపై కేసు నమోదైంది. అమీన్‌పూర్‌ వాణినగర్‌ చెరువులో అక్రమ నిర్మాణాలు చేపట్టడంతో.. ఇవాళ కాటసానికి చెందిన అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చేసింది. మరోవైపు.. మల్లంపేట చెరువులో విల్లాలు నిర్మించిన విజయలక్ష్మిపై కూడా కేసు నమోదు అయింది. హైడ్రా కూల్చివేతలపై కాటసాని స్పందించారు. హైదరాబాద్లో హైడ్రా కూల్చిన బల్డింగ్కు తనకు సంబంధం లేదన్నారు. అమీన్‌పూర్‌లో తనకు ఎలాంటి స్థలం లేదని చెప్పారు. తన స్థలంలో కాంపౌండ్ వాల్ నిర్మించానని.. తనకు సంబంధం లేని ఇష్యూలో ఇరికించాలని చూస్తున్నారని కాటసాని పేర్కొన్నారు. హెచ్ఎండీఏ, ఇరిగేషన్ అధికారులు తన భూమి ఎఫ్టీఏ (FTA) పరిధిలో లేదని చెప్పారని ఆయన చెప్పారు. అధికారులు ఎఫ్టీఏ పరిధిలో ఉందని నోటీసు కూడా ఇవ్వలేదని అన్నారు.

MPOX: అలర్ట్..భారత్ లోకి మంకీపాక్స్ ఎంట్రీ! విదేశాల నుంచి తిరిగి వచ్చిన వ్యక్తి వైరస్ లక్షణాలు!

నోటీస్ కూడా ఇవ్వకుండా పోలీసులు, అధికారులు వచ్చి దౌర్జన్యంగా తమ నిర్మాణాలు కూల్చారని కాటసాని రాంభూపాల్ రెడ్డి తెలిపారు. టీడీపీ నాయకులు కొంత మంది పనికట్టుకొని దృష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. తాను హైడ్రాకు కోరుతున్నది ఒకటే.. మీ దగ్గర ఆధారాలు ఉంటే ఒకే కానీ, మీరు నోటీసులు ఇవ్వకుండా ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు. తనకు సంబంధ లేని విషయాల్లో తన పేరు, తన అనుచరులు భూ కబ్జా చేస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. 42 పర్సంట్ తీసుకునే వాళ్ళ గురించి మాట్లాడరు కానీ.. తనను భూ కబ్జా కోరుగా చిత్రీకరించారని తెలిపారు. ఇప్పుడు అధికారులు కూల్చిన బిల్డింగ్స్ తనవేనని నిరూపించాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి తనకు మంచి మిత్రుడు, కనీసం నోటీసు ఇవ్వకుండా ఇలా చేయడం మంచిది కాదని చెప్పారు.

Rains Effect: ఏపీలో భారీ వర్షాలు.. ఈ జిల్లాల్లో రేపు విద్యా సంస్థలకు సెలవు

తనకు నోటీస్ కూడా ఇవ్వలేదు, తాను లీగల్ గా వెళ్తానని కాటసాని పేర్కొన్నారు. లోకేష్ బాబే రెడ్ బుక్ ఉందని చెబుతుంటే ఎమ్మెల్యేలు మాట్లాడడంలో ఏముందని ప్రశ్నించారు. ఫ్యాక్షన్ రాజకీయాలు చేశాం, చూశాం, ఫ్యాక్షన్ వద్దని రాజకీయం చేశామన్నారు. ఇప్పుడు రెడ్ బుక్ పేరుతో ఫ్యాక్షన్ రాజకీయాలు చేద్దామని చూస్తున్నారని చెప్పారు. పోలీసులు అధికార పార్టీ నాయకులు చెప్పిన విధంగా పనిచేస్తున్నారని ఆరోపించారు. కాలం ఇలానే ఉండదు కదా… తమ నాయకులు ఎందుకు భయపడతారని అన్నారు. రాజకీయ నాయకులు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి.. కొద్దిరోజులు పోతే ప్రజలే అందరికీ సమాధానం చెపుతారని కాటసాని రాంభూపాల్ రెడ్డి తెలిపారు.

Show comments