Site icon NTV Telugu

Durgam Chinnaiah: దుర్గం చిన్నయ్య పై కేసు నమోదు.. కారణం ఇదీ..

Durgam Chinnayya

Durgam Chinnayya

Durgam Chinnaiah: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే పై కేసు నమోదైంది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పై నెన్నెల పోలీసులు కేసు నమోదు చేశారు. నిన్న పోలింగ్ కేంద్రంలోకి ఓటు వేసేందుకు బీఆర్ఎస్ కండువాతో వెళ్లారు ఎమ్మెల్యే. ప్రిసైడింగ్ ఆఫీసర్ వోజ్జల రాజశేఖర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో అధికార పార్టీ నేత భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) ఎమ్మెల్యే గులాబీ కండువా కప్పుకుని పోలింగ్ బూత్‌లోకి వెళ్లడం కనిపించింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై చర్యలు తీసుకోవాలని ఇతర పార్టీల నేతలు డిమాండ్ చేస్తున్నారు.

Read also: Special Trains: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా.. 10 ప్రత్యేక రైళ్ల పొడిగింపు!

వివరాల్లోకి వెళితే…బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఎన్నికల కోడ్ ఉల్లంఘించి పింక్ కలర్ పార్టీ కండువా కప్పుకుని పోలింగ్ బూత్ లోకి ప్రవేశించారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య నేనెళ్ల మండలం జెండా వెంకటాపూర్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే ఓటు వేసేందుకు వచ్చిన ఆయన పార్టీ కండువా కప్పుకుని పోలింగ్ బూత్ వద్దకు వచ్చారు. ఎమ్మెల్యే ఇలా వస్తున్నా ఎన్నికల సిబ్బంది కూడా అభ్యంతరం చెప్పకపోవడం విమర్శలకు తావిస్తోంది. దుర్గం చిన్నయ్య, పోలింగ్ బూత్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్, బీజేపీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్, తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి పోటీ చేస్తున్న కామారెడ్డి నియోజకవర్గంలో టెన్షన్ నెలకొంది. పోలింగ్ బూత్ వద్ద బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు ఘర్షణకు దిగారు.
Special Trains: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా.. 10 ప్రత్యేక రైళ్ల పొడిగింపు!

Exit mobile version