NTV Telugu Site icon

Car Crash : మద్యం మత్తులో ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న కార్మికుల పైకి దూసుకెళ్లిన కారు..

Car

Car

Car Crash : మహారాష్ట్ర (Maharashtra) లోని నాగ్‌పూర్‌ (Nagpur) లో ఆదివారం తెల్లవారుజామున వైద్య విద్యార్థుల బృందం నడుపుతున్న కారు ఫుట్‌పాత్‌ పై నిద్రిస్తున్న కార్మికుల గుంపు పైకి దూసుకెళ్లడంతో ఒక పిల్లవాడితో సహా ఇద్దరు మరణించారు. అలాగే ఈ ఘటనలో మరో ఏడుగురు గాయపడ్డారని పోలీసులు తెలిపారు.

Viral News: బైక్‌పై ఏడుగురు ప్రయాణం.. పోలీసులు భారీగా చలాన్

ఈ సంఘటన దిఘోరి నాకా సమీపంలో అర్ధరాత్రి సమయంలో జరిగింది. 20 – 22 సంవత్సరాల వయస్సు గల ఆరుగురు వైద్య విద్యార్థులతో కూడిన కారు పుట్టినరోజు పార్టీ నుండి తిరిగి వస్తోన్నా సమయంలో డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో కారు కాలిబాటపై నిద్రిస్తున్న తొమ్మిది మంది కార్మికుల పైకి ప్రయాణం చేసింది. ఇందులో ఇద్దరు కూలీలు ఘటనా స్థలంలోనే మృతిచెందారు. ఘటనా స్థలం నుంచి పారిపోయేందుకు ప్రయత్నించిన కారు డ్రైవర్ పలుమార్లు వెనక్కి వెళ్లి ముందుకు వెళ్లడంతో మరింత గాయాలు అయ్యాయని పోలీసులు తెలిపారు.

Prajwal Revanna: ప్రజ్వల్ రేవణ్ణ జ్యుడీషియల్ కస్టడీని 14 రోజులు పొడిగించిన కోర్టు..

కారులో ఉన్న ఐదుగురిని అరెస్టు చేయగా, ఆరవ వ్యక్తి పరారీలో ఉన్నాడు. వారు మద్యం మత్తులో డ్రైవింగ్ చేస్తున్నారో లేదో తెలుసుకోవడానికి అరెస్టు చేసిన వారి నుండి రక్త నమూనాలను సేకరించారు సీనియర్ పోలీస్ ఇన్స్పెక్టర్ విజయ్ దిఘే. ఇక ఈ కేసును నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు పోలీసు అధికారులు.