విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై రెచ్చిపోవడం కామన్ అయిపోయింది. విధులకు ఆటంకం కలిగిస్తే.. తర్వాత జరిగే పరిణామాల గురించి ఆలోచించడం లేదు. రాజకీయ నాయకులు, ప్రముఖుల అండతో పబ్లిక్‌లోనే పోలీసులపై చిందులేస్తున్నారు. ఇలాంటి ఘటనే తాజాగా హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. పంజాగుట్ట లో కారు ఓనర్ హల్చల్ సృష్టించాడు. పెండింగ్ చలానాలు చెక్ చేసేందుకు ట్రాఫిక్ పోలీసులు కారు ఆపారు. నాలుగు వేల పెండింగ్ చలానాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
READ MORE: CM Chandrababu: ఉగాది పండుగ రోజు నుంచి పీ4 విధానం ప్రారంభించిన ఏపీ సర్కార్
“నా కారు ఆపడానికి నీకు ఎన్ని గుండెలు.. కేవలం నాలుగు వేల రూపాయల చలానా కోసం నా కారు ఆపుతావా? రెండు నిమిషాల్లో ట్రాన్స్ఫర్ చేయిస్తా..” అంటూ ట్రాఫిక్ ఎస్సై మోజీరామ్‌పై ఓనర్ చిందులేశాడు. నా ఇంట్లో ఉన్న కారుకు 16 వేల పెండింగ్ చలానా ఉంది.. ఎవరూ అడగలేదు.. నన్నే ఆపుతావా? అంటూ వీరంగం సృష్టించాడు. పంజాగుట్ట మెర్క్యూర్ హోటల్ ముందు వాహన తనిఖీలు చేస్తుండగా.. ఈ ఘటన చోటు చేసుకుంది. వీడియో రికార్డు చేసిన పోలీసులు వాహనంతో పాటు కారులో ఉన్న ఇద్దరినీ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కి తరలించారు.