Site icon NTV Telugu

Road Accident: స్కూల్ బస్సును ఢీకొన్న కారు.. 14 మంది విద్యార్థులకు గాయాలు

Road A

Road A

వరంగల్ జిల్లా నర్సంపేటలోని కమలాపురం క్రాస్ రోడ్ వద్ద స్కూల్ బస్సును, పార్చునర్ కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో 14 మంది విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Bhola Shankar: బోళా శంకర్‌కు షాక్?

వివరాల్లోకి వెళ్తే.. వరంగల్ జిల్లా నర్సంపేటలో తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. కమలాపురం క్రాస్ రోడ్ వద్ద ప్రైవేట్ స్కూల్ బస్సు, నర్సంపేట ఎమ్మెల్యే సతీమణి జడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న ప్రయాణిస్తున్న కారు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న 14 మంది విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. పెద్ది స్వప్న ప్రయాణిస్తున్న కారు ధ్వంసం కాగా.. ఆమే కూడా గాయపడ్డారు. అయితే కారులో ఉండే బెలున్ లు ఓపెన్ కావడంతో ప్రాణాపాయం తప్పింది.

Sai Pallavi: అదేం వింత అలవాటు పాప.. దాన్ని తినడమేంటి ..?

ప్రమాదంలో గాయపడ్డ పెద్ది స్వప్నను వరంగల్ ఆసుపత్రికి తరలించగా, విద్యార్థులను నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. పిల్లలు గాయపడడంతో స్థానికులతో పాటు పేరెంట్స్ ఆందోళన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే భార్యను పోలీసులు సేవ్ చేసే ప్రయత్నం చేయగా.. ఎమ్మెల్యే వారి కుటుంబ సభ్యుల కోసమే ఉన్నారా అని పోలీసులను పేరెంట్స్ నిలదీశారు. ఎమ్మెల్యే వాహనం స్పీడ్ గా వెళ్ళిన విజువల్స్ సిసి కెమెరాలో రికార్డు అయ్యాయి.

Exit mobile version