Site icon NTV Telugu

Bull Attack: మార్నింగ్ వాక్ వెళ్లిన వ్యక్తిపై ఎద్దు దాడి.. మృతి

Bull Acctack

Bull Acctack

మార్నింగ్ వాక్ వెళ్లిన వ్యక్తిపై ఎద్దు దాడికి పాల్పడింది. ఈ ఘటనలో కాన్పూర్‌ జిల్లా డిప్యూటీ జడ్జి మృతి చెందారు. ఆదివారం ఉదయం కళ్యాణ్‌పూర్‌లో మార్నింగ్ వాక్ చేస్తుండగా ఎద్దు పలుమార్లు దాడికి పాల్పడింది. ఈ ఘటనలో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే.. బాటసారులు అతన్ని ఎలాగోలా ఎద్దు బారినుంచి తప్పించారు. అనంతరం కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో అతడిని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. కాగా.. అక్కడికి తీసుకెళ్లిన వెంటనే అతను చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు.

Read Also: Peddireddy Ramachandra Reddy: రిజల్ట్ తర్వాత మాట్లాడుకుందాం.. లోకేష్ పై పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫైర్..

కళ్యాణ్‌పూర్ నానకారి నివాసి దేవేంద్ర కుమార్ యాదవ్ (58) జిల్లా జడ్జిలో డిప్యూటీ నజీర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు భార్య మీనా, ముగ్గురు కుమారులు ఉన్నారు. రోజూలాగే ఆదివారం ఉదయం మార్నింగ్ వాక్‌కి వెళ్లినట్లు బంధువులు తెలిపారు. కాగా.. ఉన్నట్టుండి ఒక ఎద్దు విచ్చలవిడిగా అతనిపై మూడుసార్లు దాడి చేసి గాయపరిచింది.

Read Also: Chhattisgarh: రాయ్‌గఢ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. చెట్టును ఢీకొట్టిన బైక్, ముగ్గురు మృతి

అది చూసిన ఆ ప్రాంతానికి చెందిన పంకజ్ తివారీ కర్ర సహాయంతో ఎద్దును తరిమికొట్టి బంధువులకు సమాచారం అందించాడు. ఆ తర్వాత తన కొడుకు కళ్యాణ్‌పూర్‌లోని ఎస్‌పిఎం ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అక్కడ వైద్యులు అతను చనిపోయినట్లు నిర్ధారించారు. ఇదిలా ఉంటే.. ఆ ప్రాంతంలో నివసిస్తున్న మరో మహిళపై కూడా ఎద్దు దాడి చేసి గాయపరిచింది.

Exit mobile version