NTV Telugu Site icon

Viral Video: ఇంకా ఇలాంటివి ఎన్ని చూడాలో.. మంటల్లో వధూవరుల ఎంట్రీ..

Viral Video

Viral Video

ఈ మధ్య వివాహ కార్యక్రమాల్లో కొన్ని సినిమా స్టంట్ లాంటి ఘటనలు తరచూ చూస్తున్నాం. ఇలాంటి ఘటనలకు సంబంధించి సోషల్ మీడియాలో అనేక వీడియోలు తెగ వైరల్ అయ్యాయి. తాజాగా, ఓ వివాహానికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం తెగ వైరల్ గా మారింది. వధూవరులులిద్దరు కళ్యాణ మంటపంలోకి ఇచ్చిన ఎంట్రీ చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. వైరల్ గా మరీనా ఈ వీడియో చూసిన వారంతా ఇదేమి క్రియేటివిరా.. బాబు.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

High Court: లోకేష్ పోస్టు చేసిన వీడియో ఆధారంగా కేసు నమోదు చేయడం సరికాదు: పిన్నెల్లి తరఫు న్యాయవాది

ఇక ఈ వీడియోలో ఓ వివాహ కార్యక్రమంలో చోటు చేసుకున్న వినూత్న ఘటనను చూసి అక్కడికి వచ్చిన అతిథులంతా అవాక్కవుతున్నారు. ఈ మధ్య ప్రతి వివాహ కార్యక్రమంలోనూ వధూవరుల ఎంట్రీ కాస్త వినూత్నంగా ఉండేలా కొత్తకొత్తగా ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ వివాహ కార్యక్రమంలో వధూవరుల ఎంట్రీ మాత్రం ఎవరు ఊహించని విధంగా ఉండేలా ప్లాన్ చేశారు. అసలు ఎం చేశారన్న విషయానికి వస్తే.. పెళ్లి చేసుకోబోతున్న వధూవరులు ఇద్దరికీ వెంక భాగాన నిప్పు అంటించారు. అలా వెనకలా మంటలు వ్యాపించగానే.. వారిద్దరూ చెట్టాపట్టాలేసుకుని పరుగెడుతూ కళ్యాణ మంటపంలోకి ఏర్పాట్లు చేశారు.

Virat Kohli: దయాల్ పై కోహ్లీ ఆగ్రహం.. వీడియో వైరల్

ఇక వధూవరులు కూడా మంటల మధ్యలో మంటపంలోకి వెళ్ళసాగారు. వారు నడుస్తున్న సమయంలో మంటలు పెద్ద ఎత్తున వ్యాపించడంతో చుట్టూ ఉన్న వారు షాక్ అయ్యారు. కాకపోతే వధూవరుల వెనుకే ఓ వ్యక్తి మంటలు ఆర్పేందుకు సిలిండర్ పట్టుకుని రెడీగా ఉన్నాడు. దీనితో ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఇక వైరల్ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.