Site icon NTV Telugu

Sangareddy Crime: ప్రియురాలి కోసం ఆమె భర్తను హతమార్చిన ప్రియుడు

Srd Murder

Srd Murder

సంగారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు దారుణంగా నరికి చంపేశారు. జిల్లాలోని రాయికోడ్ మండలం నల్లంపల్లి గ్రామంలో ఇవాళ (శుక్రవారం) ఉదయం కృష్ణ హత్యకు గురయ్యాడు. అయితే, వివరాల్లోకి వెళితే.. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని ప్రియురాలి భర్తను ప్రశాంత్ అనే యువకుడు చంపేశాడు.

Read Also: Baby : త్వరలోనే ఓటీటీ లో విడుదల కాబోతున్న బ్లాక్ బస్టర్ మూవీ..?

కంట్లో కారం పొడి చల్లి, కర్రలు, రాడ్లతో కృష్ణను చితకబాదిన ప్రశాంత్ దారుణంగా హత్య చేశాడు. కృష్ణ భార్యకి అదే గ్రామంలో ఆటో డ్రైవర్ గా పని చేస్తున్న ప్రశాంత్ కి గత కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగుతుంది. గతంలో వివాహేతర సంబంధం కారణంగా ప్రశాంత్, కృష్ణ కుటుంబాల మధ్య గొడవలు కూడా జరిగినట్లు స్థానికులు తెలిపారు. అయితే, గొడవల కారణంగా కృష్ణ భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో తన ప్రియురాలు వెళ్లిపోవడానికి కారణం కృష్ణనే అంటూ పగ పెంచుకున్న కృష్ణ ఈ దారుణ హత్యకు పాల్పడ్డాడు. హత్య చేసిన తర్వాత రాయికోడ్ పోలీస్ స్టేషన్లో నిందితుడు లొంగిపోయాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Read Also: Viral Video: వార్నీ .. కోతులు కూడా టమోటాలను వదల్లేదుగా..

ఈ దారుణ హత్యపై పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ హత్య కేసులో మృతుడి భర్య హస్తం కూడా ఏమైన ఉందా అనే విధంగా పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు.. ఎన్నాళ్ల నుంచి కృష్ణ భార్య, ఆటో డ్రైవర్ ప్రశాంత్ మధ్య అక్రమ సంబంధం కొనసాగుతుంది అనే దానిపై విచారణ జరుగుతుంది.

Exit mobile version