Site icon NTV Telugu

Fake Pilot: అమ్మాయిల కోసమే పైలెట్ అవతారం.. పలువురిని మోసం చేసిన యువకుడు

Fake Pilot

Fake Pilot

Fake Pilot:ఈ మధ్య కాలంలో ప్రేమ, పెళ్లి పేరుతో మోసలకు పాల్పడటం ఎక్కువై పోయింది.  పెద్ద ఉద్యోగం చేస్తున్నానంటూ యువతులను చాలా మంది అబ్బాయిలు మోసం చేస్తున్నారు. కేవలం అబ్బాయిలు మాత్రమే కాదు అమ్మాయిలు కూడా అబ్బాయిలను మోసం చేస్తున్నారు. తాజాగా ఓ యువకుడు తాను పైలెట్ అని చెప్పి నలుగురు అమ్మాయిలను మోసం చేశాడు. అయితే అతడిని పోలీసులు పట్టుకోవడంతో అసలు విషయం బయటకు వచ్చింది. ఇంతకీ అతనిపై అమ్మాయిలు ఫిర్యాదు చేయలేదు. అతనంతట అతనే పోలీసులకు చిక్కడంతో విచారణలో అసలు విషయాలు బయటకు వచ్చాయి.
Also Read: Delhi Metro: మెట్రోలో రెచ్చిపోయిన అబ్బాయి.. మొదట ఓ అమ్మాయితో తరువాత ఇంకో అమ్మాయితో

వివరాళ్లోకి  వెళ్తే గుజరాత్ కు చెందిన రక్షిత్ మంగేలా అనే 20 ఏళ్ల యువకుడు హైదరాబాద్ లో ఉన్న తన ప్రియురాలిని కలిసేందుకు వెళుతూ వడోదర ఎయిర్ పోర్ట్ లో అధికారులకు చిక్కాడు. పైలెట్ డ్రస్ లో ఎయిర్ పోర్ట్ లో వెళుతుండగా బోర్డింగ్ సిబ్బందికి అనుమానం వచ్చి విచారించారు. దాంతో తాను ఎయిర్ ఇండియా పైలెట్ ను అంటూ అతను పొంతన లేని సమాధానాలు చెప్పాడు. దీంతో వారు రక్షిత్ ను పోలీసులకు అప్పగించారు. హర్ని పోలీసు స్టేషన్ లో ఆ యువకుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. కాగా పోలీసు విచారణలో పలు విస్తుపోయే విషయాలు తెలిశాయి. కేవలం అమ్మాయిలను ప్రేమలో పడేసేందుకే ఆ యువకుడు నకిలీ పైలెట్ అవతారం ఎత్తినట్లు తేలింది. అతడికి రాజ్ కోట్, ముంబాయి, అహ్మదాబాద్‌, హైదరాబాద్ తో సహా నెదర్లాండ్ లో కూడా లవర్స్ ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. 20 ఏళ్ల వయసులోనే ఇంత మందితో పైలెట్ అని చెప్పి ప్రేమాయణం నడపడంతో పోలీసులే ఆశ్చర్యపోయారు. అతనికి కౌన్సిలింగ్ ఇచ్చి తల్లిదండ్రలకు జరిగిన విషయానంత చెప్పి అప్పగించారు. అంతేకాకుండా అతని గర్ల్ ఫ్రెండ్స్ కు నేను నకిలి పోలీసును అంటూ అతని చేతే మెసేజ్ కూడా పెట్టించారు. ఇక పోలీసుల విచారణలో రక్షిత్ మరో విషయాన్ని కూడా వెల్లడించాడు. తాను చిన్నప్పటి నుంచి నిజంగానే పోలీసు కావాలని అనుకున్నానని కానీ కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంతో కాలేకపోయానని అందుకే పైలెట్ అనే అబద్ధం చెప్పానని రక్షిత్ తెలిపాడు. అయితే ఇలా నకిలీ ఐడెంటిటీతో మోసం చేసే వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

Exit mobile version