NTV Telugu Site icon

Viral Video: ఆహా.. ఆ టీచర్ బోధన స్టైలే వేరప్ప.. ఎంత సులువుగా నేర్పిస్తుందంటే..?

Teacher

Teacher

Viral Video about Teacher: బీహార్‌లోని బంకా జిల్లాకు చెందిన ఖుష్బూ కుమారి అనే ఉపాధ్యాయురాలు అద్వితీయమైన బోధనా శైలి దేశవ్యాప్తంగా ఇప్పుడు సంచలనం రేపుతోంది. స్కూల్‌ పిల్లలకు బోధిస్తున్న ఆయన వీడియోలు చాలా వరకు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. బంకా జిల్లాలోని కటోరియా బ్లాక్‌ కు చెందిన కాథోన్ అనే ఈ మిడిల్ స్కూల్‌ లో బోధించే ఖుష్బూ పిల్లలకు గణితంతో పాటు ఇతర సబ్జెక్టులను సరదాగా బోధిస్తుంది. ఐఏఎస్ అధికారులతో పాటు పలువురు ఆమె వీడియోలను షేర్ చేశారు. ఇకపోతే ఈసారి ఆమె పిల్లలకు హిందీ ఒత్తులను నేర్పించే విధానం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

Committee Kurrollu: త్వరలోనే ‘కమిటీ కుర్రోళ్లు’ చూస్తా: మహేష్ బాబు

ఈ వైరల్ వీడియోలో, ఉపాధ్యాయురాలు ఖుష్బూ ఆనంద్ తన చేతి సంజ్ఞలతో పాఠశాల విద్యార్థులకు హిందీ ఒత్తులను వివరిస్తోంది. ఈ హిందీ ఒత్తులను పిల్లలకు వివరించే విధానం నిజంగా అద్భుతం. ఖుష్బూ తన సోషల్ మీడియా ఖాతా ‘ఎక్స్’ (ట్విట్టర్)లో దీనికి సంబంధించిన వీడియోను కూడా పంచుకున్నారు. వీడియోను షేర్ చేస్తూ.., ‘పిల్లల పరిమాణం, అవగాహన మంచి మార్గంలో అభివృద్ధి చెందాలంటే.. కొన్నిసార్లు మనం కూడా పిల్లలుగా మారాలి. పిల్లలుగా మారి, పిల్లలకు నేర్పించాలి. ఈ బోధన అభ్యాస ప్రక్రియలో సహాయం చేయడం చాలా గొప్పది. ఆనందాన్ని ఇస్తుంది అంటూ తెలిపింది.

Nagarjuna Sagar: సాగర్ కు కొనసాగుతున్న వరద.. 18 గేట్లు ఎత్తివేత..

టీచర్ ఖుష్బూ బోధన తీరుపై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈసారి కూడా చాలా మంది నెటిజన్స్ ఆమె బోధించే విధానాన్ని మెచ్చుకున్నారు. ఇందులో ఒక నెటిజన్.. ‘విద్యను అందుబాటులోకి తీసుకురావడంలో, ఆసక్తికరంగా చేయడంలో విజయం సాధించారు’ అంటూ కామెంట్ చేయగా.. మరొకరైతే., ‘ఇలాంటి ఉపాధ్యాయులు మనదేశంలో ఇంకా ఎక్కువ మంది ఉంటే విద్యావ్యవస్థ మరింత బాగుంటుంది’ అని కామెంట్ చేసారు.

Show comments