NTV Telugu Site icon

Gupta Nidhulu: గుప్తనిధుల పేరుతో బడా మోసం.. గుట్టురట్టు చేసిన పోలీసులు

Guptha Nidulu

Guptha Nidulu

గుప్తనిధుల పేరుతో బడా మోసం చేస్తున్న ముఠాను పోలీసులు గుట్టురట్టు చేశారు. వారి వద్ద నుంచి రూ. 15 లక్షల 47 వేల నగదు, 540 వెండి రేకు నాణేలు, 76 బంగారు రేకు నాగ పడిగ బిల్లలు, పూజ సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో.. జనగామ డీసీపీ రాజమహేంద్ర నాయక్ వివరాలను వెల్లడించారు. వివరాల్లోకి వెళ్తే.. జనగామ జిల్లా కొడకండ్ల మండలం కేంద్రంలో ఇంట్లో వరుసగా కుటుంబ సభ్యులు చనిపోతుండడంతో గుప్తనిధులు వెలికి తీస్తే మరణాలు ఆగిపోతాయని ఘరానా మోసానికి పాల్పడ్డ నిందితులను పాలకుర్తి పోలీసులు పట్టుకొని కేసుని ఛేదించారు.

Read Also: Uttar Pradesh: పేపర్ లీకులకు చేశారో అంతే సంగతి.. జీవిత ఖైదు, రూ. 1 కోటి జరిమానా..

సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం చీర్లవంచకు చెందిన కడమంచి రజనీకాంత్ మరో ముగ్గురితో కలిసి మొదటగా కుటుంబ వివరాలు తెలుసుకున్నాడు. ఆ తర్వాత.. కొడకండ్ల మండలానికి చెందిన ఓ మహిళ ఇంట్లోకి వెళ్లి కుటుంబంలో వరుసగా చనిపోతున్నారని నమ్మబలికాడు. ఆ తర్వాత మీ ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయని వాటిని వెలికి తీయాలని లేదంటే మీ ఇంట్లో ఉన్నవారు కూడా మరణిస్తారని చెప్పాడు. దీంతో.. ఆ గుప్త నిధులు తీయడానికి లక్షల ఖర్చు అవుతుందని చెప్పి డబ్బులు వసూలు చేశారు. నిందితులు గతంలో కూడా ఇదే విధమైన మోసాలకు పాల్పడ్డారు. కాగా.. ఈ మోసంపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.

Read Also: Pranava Group: ప్రణవ గ్రూప్‌ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం..