NTV Telugu Site icon

Bihar: నాలుగు చేతులు, నాలుగు కాళ్లతో జన్మించిన శిశువు.. కాసేపటికే కన్నుమూత

Baby

Baby

బీహార్ లోని సరన్ జిల్లా చాప్రాలో నాలుగు చేతులు, నాలుగు కాళ్లతో శిశువు జన్మించింది. ఆ పసికందు తల ఆకారం కూడా అసాధారణంగా ఉంది.. అసాధారణంగా జన్మించిన ఆడశిశువును చూసేందుకు నర్సింగ్ హోమ్ కు జనం భారీగా తరలి వచ్చారు. ఆ పసికందును పలువురు దేవుడి ప్రతిరూపం అని భావించగా.. మరొకొందరు దీనిని జీవ అసమానతగా చూశారు. అయితే దురదృష్టవశాత్తూ పాప పుట్టిన 20 నిమిషాలకే కన్నుమూసింది.

Also Read : Animal : ఎనిమల్ సినిమాని వదులుకున్న ఆ స్టార్ హీరో ఎవరో తెలుసా..?

సరన్ జిల్లాకు చెందిన ప్రసుతా ప్రియాదేవి చాప్రాలోని శ్యామ్చక్లోని సంజీవని నర్సింగ్ హోమ్ లో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే నవజాత శిశువును చూసి డాక్టర్లు కూడా ఆశ్చర్యపోయారు. పాప ఇట్ల జన్మించిందన్న విషయం వేగంగా వ్యాప్తి చెందింది. దీని వల్ల స్థానికంగా ఈ విషయం చర్చనీయాంశమైంది. ఆ పాపకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి.

Also Read : KTR-Harish Rao: నేడు సిద్దిపేటలో కేటీఆర్‌, హరీశ్‌రావు పర్యటన.. ఐటీ టవర్ ప్రారంభించనున్న మంత్రులు

ఈ అసాధారణ శిశువు గురించి ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ అనిల్ కుమార్ వెల్లడించారు. చిన్నారికి ఒకే తల, నాలుగు చెవులు, నాలుగు కాళ్లు, నాలుగు చేతులు, రెండు వెన్నెముకలు ఉన్నాయన్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆమెకు రెండు గుండెలు ఉన్నాయని ఆయన తెలిపారు. ఈ శిశువును తల్లి కడుపులో నుంచి బయటకు తీసేందుకు హాస్పిటల్ యాజమాన్యం సిజేరియన్ చేసింది.. కానీ దురదృష్టవశాత్తు జన్మించిన సుమారు 20 నిమిషాల తరువాత ఆ పాప మరణించింది. అయితే తల్లి ఆరోగ్యంగానే ఉందన్నారు. ఇలాంటి ఘటనలు చాలా అరుదుగా జరుగుతాయని డాక్టర్లు చెప్పారు. గర్భాశయం లోపల ఒకే అండంలో ఇద్దరు పిల్లలు తయారైనప్పుడు ఇలాంటివి సంభవిస్తాయి. కొన్ని కారణాల వల్ల కవలల విభజన ఆలస్యమైతే లేదా అసంపూర్ణంగా ఉంటే ఇలాంటి ప్రత్యేక లక్షణాలతో పిల్లలు పుట్టడానికి దారి తీసే ఛాన్స్ ఉంటుందని పేర్కొన్నారు.