NTV Telugu Site icon

Viral Video: అద్భుతంగా కారు నడిపిన 95 ఏళ్ల బామ్మ.. వీడియో చేసిన నాగాలాండ్ మంత్రి

Car Driving

Car Driving

నాగాలాండ్‌ పర్యాటక శాఖ మంత్రి టెమ్‌జెన్ ఇమ్నా అలోంగ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఆయన షేర్ చేసిన వీడియోలు యూజర్లకు బాగా నచ్చుతాయి. తాజాగా ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ వీడియో తెగ వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే.. ఓ బామ్మ అద్భుతంగా కారు డ్రైవింగ్ చేస్తోంది. వయసు అనేది కేవలం సంఖ్య మాత్రమేనని ఈ బామ్మ మరోసారి నిరూపించిందని ట్వీట్ చేశాడు.

BJP: రాజస్థాన్ నుంచి బీజేపీ రాజ్యసభ అభ్యర్థులు వీరే

ఈ వీడియోను మొదట సుమిత్ నేగి అనే వినియోగదారు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. క్యాప్షన్‌లో, “నా 95 ఏళ్ల బామ్మ మొదటిసారి డ్రైవింగ్ చేస్తుందని” అని పేర్కొన్నాడు. వీడియోలో నేగి తన అమ్మమ్మతో సరదాగా సంభాషణలో నిమగ్నమై ఉన్నాడు. ఆమె తన కళ్లను రోడ్డుపై అతుక్కొని డ్రైవ్ చేస్తున్నట్లు చూపింది. అంతేకాకుండా.. తన మనవడితో ఆనందంగా కబుర్లు చెబుతూ ముందుకు వెళ్తుంది.

Poonam Pandey: మా మనోభావాలు దెబ్బ తీసింది.. 100 కోట్లు కట్టాలంటూ పూనమ్ పాండేపై దావా

వీడియోను షేర్ చేస్తూ.. ‘అమ్మమ్మ 95 ఏళ్ల వయసులో రాకింగ్ చేస్తున్నారు!’ అని మంత్రి తెలిపారు. ఈ వీడియోకు ఇప్పటికి 30 వేల మందికి పైగా ఈ వీడియోను వీక్షించారు. అంతేకాకుండా.. రకరకాల ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ‘అమ్మమ్మ డ్రైవింగ్, ఆమె స్పైసీ టాక్స్’ అని రాశారు. మరొకరు, ‘అమ్మమ్మ ఎనర్జీ లెవెల్ భిన్నంగా అనిపిస్తుంది అని కామెంట్స్ చేస్తున్నారు.

Show comments