Site icon NTV Telugu

Madhya Pradesh: 62 ఏళ్ల వ్యక్తికి 30 ఏళ్ల భార్య.. వీరికి ముగ్గురు పిల్లలు

62 Years Man

62 Years Man

మధ్యప్రదేశ్‌లోని సాత్నా జిల్లాలో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. 62 ఏళ్ల భర్త, 30 ఏళ్ల భార్య ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చారు. గోవింద్ కుశ్వాహా(62), ఉచెహ్ర మండలంలోని అతర్వేడియా ఖుర్ద్ గ్రామానికి చెందిన వ్యక్తి.. అతనికి యుక్త వయస్సులోనే కస్తూరి బాయ్‌తో పెళ్లి జరిగింది. వారికి ఓ కుమారుడు పుట్టాడు.. కానీ కొడుకు పెద్దయ్యాక (18 ఏళ్ల వయస్సు) ఓ ప్రమాదంలో చనిపోయాడు. దీంతో భర్తను రెండో వివాహం చేసుకోవాలని భార్య కస్తూరి భాయ్‌ కోరింది. దీంతో ఆ తర్వాత గోవింద్‌కు హీరాభాయ్‌ని వివాహం చేసుకున్నారు.

Also Read : Viral Video : ఏం ఐడియా రా బాబు.. ఇది బైక్ నా.. ఆటోనా..

సోమవారం రాత్రి హీరాభాయ్‌కి పురిటి నొప్పులు రావడంతో స్థానిక దవాఖానాకు వెళ్లారు. ప్రస్తుతం ఆమెకు ముగ్గురు పిల్లలు పుట్టారు. పెళ్లైన ఆరేళ్లకు ట్రిపుల్ ధమాకాతో వీరి ముచ్చట తీరింది. దీంతో గోవింద్ కుశ్వాహా ఆనందం వ్యక్తం చేశారు. పిల్లల ఆరోగ్యం బాగుండాలని వారు వేడుకుంటున్నారు. ప్రస్తుతం ముగ్గురు పిల్లల ఆరోగ్యం విషమంగా ఉన్నందున ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు డాక్టర్లు వెల్లడించారు. ప్రిమెచ్యూర్ కారణంగానే పిల్లల ఆరోగ్యం విషమంగా ఉందని వైద్యులు తెలియజేస్తున్నారు.

Also Read : Bandi Sanjay: చివరి క్షణంలో రద్దైన అమిత్ షా టూర్.. కార్యకర్తలు నిరాశపడవద్దన్న బండి సంజయ్‌

అయితే హీరోభాయ్ కి పుట్టిన పిల్లలు కాస్త బలహీనంగా ఉండటంతో వారిని ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. నేను రెండు పెళ్లిళ్లు చేసుకున్నాను అని గోవింద్ కుశ్వాహా అన్నాడు. నా మొదటి భార్య పేరు కస్తూరిబాయి.. ప్రస్తుతం ఆమెకి 60 ఏళ్లు.. ఐతే 18 ఏళ్ల వయసులో రోడ్డు ప్రమాదంలో నా కొడుకు మరణించాడు.. దీంతో నా ఫస్ట్ భార్య కస్తూరిబాయే దగ్గరుండి మరీ నాకు సెకండ్ మ్యారేజ్ చేసింది. పెళ్లయిన ఆరేళ్లకు హీరాబాయి ముగ్గురు పిల్లలకు జన్మనివ్వడంతో ఆ కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది.

Exit mobile version