NTV Telugu Site icon

Hyderabad: మాదాపూర్‌లో ఓవైపునకు ఒరిగిన 5 అంతస్తుల భవనం.. తప్పెవరిది?

Hyd News

Hyd News

గచ్చిబౌలి.. మాదాపూర్ సిద్దిక్ నగర్ లో 5 అంతస్తుల భవనం ఓవైపునకు ఒరిగింది. ఈ భవనాన్ని కూల్చి వేసేందుకు రంగం సిద్ధమైంది. నిన్న రాత్రి 8:10 నిమిషాలకు పెద్ద శబ్దంతో 60 గజాల స్థలంలో ఒరిగింది. సరైన నిర్మాణ ప్రమాణాలు పాటించకుండా ఇంటి నిర్మాణ కోసం పక్కకే 150 గజాల స్థలంలో పిల్లర్ పూట్టింగ్ కోసం పెద్ద గుంత తవ్వడంతో ఈ భవనం వంగినట్లు చెబుతున్నారు. కూల్చివేసేందుకు సిద్ధమైన భవనం 60 గజాల స్థలం ఉంది. హైడ్రాలిక్ యంత్రంతో మరికొద్ది సేపట్లో కూల్చి వేసేందుకు సిద్ధమవుతున్నారు హైడ్రా అధికారులు. కుంగిన భవనం చు పక్కల ఉన్న ఇళ్ళల్లోని నివాసితులకు ఖాళీ చేయించారు. జిహెచ్ఎంసి, డి ఆర్ఎఫ్ ట్రాఫిక్, విద్యుత్, అంబులెన్స్ & లా అండ్ ఆర్డర్ పోలీసులు ఘటనా స్థలంలో పరిస్థితులను పర్యవేక్షిస్తూ.. అప్రమత్తంగా ఉన్నారు.

READ MORE: Virat Kohli: విరాట్ కోహ్లీని అక్కడే టార్గెట్‌ చేయండి.. ఆస్ట్రేలియా బౌలర్లకు హీలీ సూచన!

కాగా.. 5 అంతస్తుల భవనం యజమాని స్వప్న మాట్లాడుతూ.. రెండు సంవత్సరాల క్రితం భవనం నిర్మించినట్లు తెలిపారు. “50 గజాల స్థలంలో జీ ప్లస్ ఫోర్ మొత్తం ఐదు అంతస్తులు భవనం నిర్మించాం. 15 రోజుల నుంచి మా భవనం పక్కనే ఖాళీ స్థలంలో ఇంటి నిర్మాణం కోసం పనులు జరుగుతున్నాయి. మా ఊరు మిర్యాలగూడ మా ఆయన కారు డ్రైవర్, మాకు ఇద్దరు పిల్లలు. మాకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా మా భవనం పక్కనే ఉన్న స్థలం యజమాని గుంతలు తవ్వాడు. ఆ గుంతలు తొవ్వుతున్న క్రమంలో మా పిల్లర్స్ డ్యామేజ్ అయ్యాయి. దాని కారణంగా మా భవనం ఓవైపు ఒరిగింది. మా ఊర్లో ఉన్న భూములు అమ్ముకొని మాదాపూర్ లో ఇల్లు కట్టుకుని ఉంటున్నాం. అధికారులు మా భవనం కూల్చేందుకు మేము ఒప్పుకున్నాం. మా భవనం ప్రతి ఫ్లోర్ లో 6 రూంలు ఉన్నాయి. మొత్తం 20 మంది ఉంటున్నారు. ఇప్పుడు మా భవనం కులుస్తే మా పరిస్థితి ఏంటి? మాకు మా పిల్లలకు ఈ భవనమే ఆధారం. మాకు న్యాయం జరగాలి. కాళీ స్థలంలో ఇంటి నిర్మాణం చేపట్టిన స్థలం యజమానితో నష్ట పరిహారం కట్టించాలి.” అని ఓనర్ ఆవేదన చెందారు.