Site icon NTV Telugu

Madhya Pradesh: మైనర్ బాలికపై ముగ్గురు అత్యాచారం.. వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్

Madyapradesh

Madyapradesh

ప్రస్తుత సమాజంలో మహిళలకు, బాలికలకు రక్షణ లేకుండా పోయింది. ఏదో సినిమాలో చెప్పినట్టు అమ్మ కడుపులో తప్ప మహిళలకు బయట సమాజంలో ఎక్కడా రక్షణ దొరకడం లేదు అన్నమాట నిజమైనట్లు కనిపిస్తుంది. ఇంట్లో, స్కూళ్లో, ఆఫీస్ లో ఎక్కడ కూడా మహిళకు రక్షణ లభించడం లేదు. లేడీస్ పై లైంగిక వేధింపులు ప్రస్తుతం సర్వ సాధారణమైపోయాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల రక్షణ కోసం ఎన్నో చట్టాలు తెచ్చిన అవి కామాంధులకు భయాన్ని మాత్రం కల్పించడంలో విఫలం అవుతున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్ లో ఇలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. 15 ఏళ్ల ఓ బాలికపై ముగ్గురు మైనర్ బాలురు అత్యాచారానికి ఒడిగట్టారు.

Read Also: Sunday Stotram: స్తోత్ర పారాయణం చేస్తే యశస్వి, నిరోగి, దీర్ఘాయుష్మంతులు అవుతారు

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయిని జిల్లా బిర్లా గ్రామ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో 15 ఏళ్ల బాలిక నివసిస్తోంది. అయితే, ఆమెపై ముగ్గురు మైనర్లు ఇటీవల అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణాన్ని వారు తమ సెల్ ఫోన్లలో వీడియో కూడా తీసిన.. ఆ ముగ్గరు మైనర్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో శుక్రవారం సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

Read Also: Adhika Sravana: అధిక శ్రావణ ఈ స్తోత్రాలు వింటే ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు పొందుతారు

అయితే, ఈ వీడియో పోలీసుల వరకు చేరింది. దీంతో ఈ ఘటనపై విచారణ ప్రారంభించారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో పోలీసులు తెలుసుకున్నారు. అనంతరం బాధితురాలిని వారు గుర్తించారు. ముగ్గురు నిందితులను పోలీసులు కనుగొన్నారు. వారిలో ఇద్దరిని అదుపులోకి తీసుకోగా.. మూడో నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ముగ్గురు నిందితులపై భారత శిక్షాస్మృతి, లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ (పోక్సో) చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని బిర్లా గ్రామ్ పోలీస్ స్టేషన్ ఇన్ చార్జి కరణ్ సింగ్ వెల్లడించారు.

Exit mobile version