Site icon NTV Telugu

Boy Kidnap: యూపీలో 15 ఏళ్ల బాలుడు కిడ్నాప్.. అనంతరం హత్య

Kidnap

Kidnap

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఓ మైనర్‌ బాలుడిని కిడ్నాప్ చేసి హత్య చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. బాలుడు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా కిడ్నాపర్లు అతన్ని కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత బాలుడి పేరెంట్స్ కు ఫోన్ చేసి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు పోలీసులకు చెప్పారు. దీంతో పోలీసులు కిడ్నాపర్ల కోసం గాలిస్తుండగా.. తమను పట్టుకుంటారనే భయంతో ఆ బాలుడిని చంపి మృతదేహాన్ని అడవిలో పడేశారు.

Read Also: JDS: బీజేపీతో జేడీఎస్ పొత్తు.. కీలక ముస్లిం నేత రాజీనామా..

వివరాల్లోకి వెళ్తే.. ఈ ఘటన శంకర్‌గఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. గత రాత్రి 15 ఏళ్ల బాలుడు కిడ్నాప్‌కు గురికాగా.. దుండగులు బాలుడి తండ్రికి ఫోన్ చేసి రూ.15 లక్షలు డిమాండ్ చేశారు. ఈ మొత్తం ఘటన బాలుడి తండ్రి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు రాత్రంతా ఆ బాలుడి ఆచూకీ కోసం వెతికారు. కానీ ఎంతకు కిడ్నాపర్లను పట్టుకోలేకపోయారు. అయితే తెల్లవారుజామున అడవిలో బాలుడి మృతదేహం పడి ఉందని పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు అక్కడకు వెళ్లి పరిశీలించగా కిడ్నాప్ అయిన బాలుడి మృతదేహమని తేలింది. పట్టుబడతామనే భయంతో కిడ్నాపర్లు కిడ్నాప్ చేసిన మైనర్‌ను చంపి మృతదేహాన్ని అడవిలో పడేసి వెళ్లిపోయారు.

Read Also: Karnataka Crime News: బెంగళూరులో ఓ వ్యక్తిపై 70సార్లు కత్తిపోట్లు.. మృతి

పోలీసు కమిషనర్ రమిత్ శర్మ స్వయంగా సంఘటనా స్థలానికి చేరుకుని మొత్తం ఆపరేషన్‌ను పర్యవేక్షించారు. అయితే కుమారుడి మరణవార్త విని కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు అయితే కిడ్నాపర్ల జాడ కోసం వెతకగా.. వారి ఆచూకీ దొరికిందని పోలీసులు తెలిపారు. పోలీసులు వారిని అరెస్టు చేసేందుకు వెళ్లగా.. ఇద్దరి మధ్య ఎన్‌కౌంటర్‌ జరిగి కాల్పులకు పాల్పడ్డారు. అయితే ఈ కాల్పుల్లో కొందరు దుండగులు గాయపడగా.. నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.

Exit mobile version