Site icon NTV Telugu

Instagram: తల్లి పేరుతో ఐడీ.. న్యూడ్ ఫోటోలు తనవి.. ట్విస్ట్ ఇచ్చిన ప్రియుడు

Instagram Down

Instagram Down

Instagram: సోషల్ మీడియా వినియోగం ఈ రోజుల్లో బాగా పెరిగింది. ప్రతీ ఒక్కరికీ ఫేస్ బుక్, ఇన్ స్టా, ట్విటర్ ఏదో ఒక దాంట్లో అకౌంట్లు తప్పనిసరిగా ఉంటున్నాయి. పిల్లల దగ్గరనుంచి వృద్ధుల వరకు స్మార్ట్ ఫోన్లతో కాలక్షేపం చేస్తున్నారు. ఈ క్రమంలోనే కరోనా వచ్చిన దగ్గరనుంచి చదువుల పేరుతో పిల్లల చేతికి మొబైల్ ఫోన్ తప్పనిసరి అయింది. కానీ, మొబైల్ వాడకం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి. పిల్లలు మంచి వీడియోలను చూడటం ద్వారా ఏదైనా నేర్చుకుంటున్నారని తల్లిదండ్రులు భావిస్తున్నారు. వారి మొబైల్ ఫోన్‌లో ఏమి జరిగిందో పట్టించుకోవడం లేదు. అలాంటి సందర్భంలోనే ఇలాంటి బ్యాడ్ న్యూస్ వినాల్సి వస్తుంది. అందుకే తల్లిదండ్రులను అప్రమత్తం చేసే వార్త ఇది.

Read Also: IMF: 2023 ప్రపంచవృద్ధిలో సగం వాటా భారత్, చైనాలదే..

ఈ ఘటన నాగ్‌పూర్ జిల్లాలోని ఓ గ్రామంలో జరిగింది. సోను (పేరు మార్చాం)కి పన్నెండేళ్లు పూర్తయ్యాయి. తను తక్కువ వయసులోనే సోషల్ మీడియాలో అకౌంట్ ఓపెన్ చేసింది. యూత్ పైగా కొత్త కాబట్టి ఆమెకు ఆకర్షణ కలగడం సహజం. ఈ విధంగా ఆమె కరోనా కాలంలో మొబైల్ ఫోన్‌ను విరివిగా ఉపయోగించింది. చదువుకుంటుందని ఆమెకు మొబైల్ తప్పనిసరిగా భావించి పేరెంట్స్ అందించారు. కుటుంబసభ్యులు ఆమె చదువు కోసం ఏదో ఒకటి చూస్తూ ఉంటుందనుకున్నారు. స్టడీ వీడియోలు ఉపయోగకరంగా ఉన్నాయని తాను తల్లిదండ్రులకు చెప్పింది. కానీ, సోనూకి ఈ క్రమంలోనే ఇన్‌స్టాగ్రామ్ గురించి అర్థమైంది. దాని పట్ట ఆకర్షితురాలైంది. దీంతో ఆమె తన తల్లి పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా తెరిచింది. దాంట్లో ఓ యువకుడు పరిచయమైనాడు. అప్పటి నుండి ఆమెకు ఇన్‌స్టా స్నేహితుడితో బంధం ఏర్పడింది.

Read Also: IPL 2023 : కోహ్లీకి డ్యాన్స్ నేర్పించిన కింగ్ ఖాన్

అక్టోబర్ 2022 నుండి ఇన్‌స్టాలో నగర్‌కు చెందిన అనిల్ కర్మద్‌తో సోను టచ్‌లో ఉంది. అతడు వాడేది నకిలీ ఐడీ. మొదట్లో ఆమెతో ఆప్యాయంగా మాట్లాడాడు. దీంతో ఆమె అతడిని నమ్మింది. ఆ సమయంలో తన న్యూడ్ ఫోటోలను అతడితో షేర్ చేసుకుంది. అప్పటినుంచే సోనూకు కష్టాలు మొదలయ్యాయి. ఫోటోలు పంపించిన తర్వాత గానీ అనిల్ తన నిజస్వరూపాన్ని బయటపెట్టాడు. తనతో మాట్లాడకపోతే సోనూ న్యూడ్ ఫోటోలు ఫేస్ బుక్ లో షేర్ చేస్తానని బెదిరించడం మొదలుపెట్టాడు. సోనూ బంధువులకు అసభ్యకరమైన ఫొటోలు పంపాడు. బాలిక ఇంట్లో జరిగినదంతా వెలుగులోకి వచ్చింది. ఆమె తన తప్పును అంగీకరించింది.

Exit mobile version