9000 Crores Deposited: క్యాబ్ డ్రైవర్ బ్యాంక్ ఖాతాలో 9000 కోట్లు జమ.. చివరకు ఏమైందంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
9000 Crore deposited to Cab Driver Account by Tamilnadu Mercantile Bank in Chennai: ఓ క్యాబ్ డ్రైవర్ బ్యాంక్ ఖాతాలో భారీ మొత్తంలో డబ్బు జమ అయింది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా రూ. 9000 కోట్లు జమ అయ్యాయి. ఆ డబ్బు వచ్చింది బ్యాంకు నుంచే కావడం విశేషం. ఈ ఘటన తమిళనాడులోని చెన్నైలో చోటుచేసుకుంది. చెన్నైలోని తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ నుంచి ఓ క్యాబ్ డ్రైవర్ బ్యాంక్ ఖాతాలో రూ. 9000 కోట్లు జమ చేయబడ్డాయి. ఈ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
చెన్నైలోని పళనికి చెందిన క్యాబ్ డ్రైవర్ రాజ్‌కుమార్‌కు తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్‌లో అకౌంట్ ఉంది. సెప్టెంబరు 9న రాజ్‌కుమార్ ఖాతాలో రూ. 9000 కోట్లు జమ అయ్యాయి. తన బ్యాంకు ఖాతాలో భారీగా డబ్బు డిపాజిట్ అయిందని ఎస్‌ఎంఎస్ నోటిఫికేషన్ ద్వారా అతడికి తెలిసింది. తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ నుంచి రూ. 9000 కోట్లు తన ఖాతాలో జమ అయినట్లు ఎస్‌ఎంఎస్‌లో ఉంది. ఇంత డబ్బు తన ఖాతాలో ఎందుకు డిపాజిట్ అవుతుందని, ఇది ఓ స్కామ్ అని రాజ్‌కుమార్ ముందుగా భావించాడు.
Also Read
తన ఖాతాలో ఇంత డబ్బు నిజంగానే జమ అయిందా? అని తెలుసుకోవడానికి రాజ్‌కుమార్ తన స్నేహితుడికి రూ. 21000 బదిలీ చేశాడు. ఆ లావాదేవీ సజావుగా పూర్తయింది. దాంతో రాజ్‌కుమార్ ఒక్కసారిగా షాక్ తిన్నాడు. తన ఖాతాలో నిజంగానే బ్యాంకు ద్వారా భారీ మొత్తం జమ అయిందని గ్రహించాడు. అయితే రాజ్‌కుమార్ ఆనందం కొద్దిసేపు మాత్రమే ఉంది. తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ అతడి ఖాతా నుంచి పూర్తి డబ్బును తిరిగి (డెబిట్) తీసేసుకుంది. ఈ విషయంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. రాజ్‌కుమార్ ఎంత మొత్తం డ్రా చేశాడు?, ఆ డబ్బును తిరిగి తీసుకుంటుందా? అని తెలియాల్సి ఉంది.
BREAKING: ₹9000 crore deposited to a car driver bank account by Tamilnadu Mercantile Bank in Chennai. pic.twitter.com/VVjPbB9cgy
— Manobala Vijayabalan (@ManobalaV) September 21, 2023
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?