Site icon NTV Telugu

Care Hospitals: 90 ఏళ్ల వృదుడికి బంజారాహిల్స్ కేర్ హాస్పిటల్స్‌లో విజయవంతమైన బీటింగ్ హార్ట్ బైపాస్ సర్జరీ

Care Hospital

Care Hospital

హైదరాబాద్ 17th ఆగష్టు 2023: రాయ్‌పూర్‌కు చెందిన 90 ఏళ్ల వృదుడికి క్వాడ్రాపూల్ బైపాస్సర్జరీని విజయవంతంగా నిర్వాయించినట్లు కేర్ హస్పిటల్ బంజారాహిల్స్‌లోని కార్డియాక్ సర్జరీ డైరెక్టర్ ప్రతీక్ భట్నాగర్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. డాక్టర్ ప్రతీక్ భట్నాగర్ నేతృత్వాల్లోని వైద్య బృందం 90 ఏళ్ల రోగి శ్రీపరస్ రామ్ గారికి టోటల్ ఆర్టరీ రివాస్కులరైజేషన్‌ని ఉపయోగించి కొట్టుకుంటున్నగుండెపై బైపాస్ సర్జరీ నిర్వయించారు. కాళ్లకు ఎలాంటి కోతలు లేకుండా, ఓపెన్ హార్ట్ సర్జరీ కాకుండా, గుండెకు ఎలాంటి కోతలు లేకుండా, గుండె ఆగకుండా బైపాస్ ఆపరేషన్ చేశారు.

Read Also: Syed Sohel: డిప్రెషన్ లోకి వెళ్ళిపోయా.. సొహైల్ షాకింగ్ కామెంట్స్

వివరాల్లోకి వెళితే.. పేషెంట్ శ్రీ పరాస్రామ్ తన స్వస్థలం అయినా రాయిపూర్లో అస్థిరమైన ఆంజినా (విశ్రాంతి సమయంలో ఛాతీ నొప్పి) కలిగిఉన్నాడు. కరోనరీ యాంజియోగ్రఫీ చేయగా బిగుతుగాఉన్న ఎడమ ప్రధాన కరోనరీఆర్టరీ వ్యాధిని కలిగిఉన్నటు నిర్దారణ కావడంతో మరియు అతని కర్ణికదడ (క్రమరహిత గుండె కొట్టుకోవడం)లో కూడా ఇబ్బందిపడడంతో బైపాస్ ఆపరేషన్ అవసరమని డాక్టర్లు నిర్ణయించడం జరిగింది . 90 సంవత్సరాలవయస్సులో కూడా చురుకైన వ్యక్తికావడంతో, అతను మరియు అతనికుటుంబం మెరుగైన జీవన నాణ్యత కోసంకరోనరీ బైపాస్ సర్జరీకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. దీనితో బంజారాహిల్స్ కేర్ ఆసుపత్రిలో డాక్టర్ప్రతీక్ భట్నాగర్ సంప్రదించగా డాక్టర్ ప్రతీక్ భట్నాగర్ మరియు అతని బృందం రోగికి “Y” గ్రాఫ్ట్‌ని ఉపయోగించి అతనికి 4 బైపాస్ గ్రాఫ్ట్‌లను ఏర్పాటు చేయడంతోరోగి తిరిగి కోలుకున్నారు.

Read Also: KA Paul: మోడీ, కేసీఆర్, రాహుల్ గాంధీని ఢీ కొట్టేది నేనే..

ఈసందర్బంగా డాక్టర్ ప్రతీక్ భాటీన్గార్ మాట్లాడుతూ.. ఈ రోజుల్లోవయస్సు అనేది కేవలం సంఖ్య మాత్రమేనని మంచి సర్జికల్ టీమ్మరియు మంచి హాస్పిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఉంటె సురక్షితంగాబైపాస్ సర్జరీని అందించవచ్చునని అయన తెలిపారు. 90 ఏళ్లవయస్సులో ఉన్న వ్యక్తికి ఆపరేషన్చేయడంలో ప్రధాన ప్రమాదాలు బ్రెయిన్ స్ట్రోక్ మరియు కిడ్నీ ఫెయిల్యూర్ లాంటి రిస్క్ ఉంటాయని అందువల్ల, డాక్టర్. భట్నాగర్ మరియు అతని బృందం ఈవయస్సులో అథెరోమాటస్ అయిన బృహద్ధమని (గుండెయొక్క గొప్ప రక్తనాళం)ను తాకకుండా మొత్తంశస్త్రచికిత్స “అనార్టిక్” చేసారు – తద్వారా మెదడు “స్ట్రోక్” సంభవించకుండా నిరోధించారు. కొట్టుకుంటున్న గుండెపై Y గ్రాఫ్ట్‌తో మొత్తం ధమనిరీవాస్కులరైజేషన్ చేయడం ద్వారా ఈ అనార్టిక్ బైపాస్సర్జరీ సాధించబడింది. మొత్తం శస్త్రచికిత్స సమయంలో మంచి దైహిక రక్తపోటునునిర్వహించడం ద్వారా, మూత్రపిండాలు దెబ్బతినకుండా నిరోధించబడ్డాయి దీనితో రోగి బైపాస్సర్జరీ తర్వాత రోగి యొక్క కర్ణికదడ కూడా మంచి సాధారణసైనస్ రిథమ్‌గా మార్చబడింది దీనితోరోగి సర్జరీ జరిగిన 20 గంటల తర్వాత తన టీ నిఆస్వాదించడం ప్రారంభించాడు మరియు అతని బైపాస్ సర్జరీ 2 రోజులు తర్వాత సాధారణ గుండె పంపింగ్‌తో కోలుకోవడంజరిగింది తర్వాత రోజు డిశ్చార్జ్ అయినట్లుడాక్టర్ తెలిపారు.

Read Also: Nirmala Sitharaman: బానిస మనస్తత్వాన్ని తొలగిస్తేనే కల సాకారం అవుతుంది

శ్రీనీలేష్ గుప్తా HCOO CARE హాస్పిటల్ బంజారాహిల్స్ మాట్లాడుతూ.. BIMAతో బీటింగ్ హార్ట్సర్జరీ చేయడంలో డాక్టర్ భట్నాగర్ అంతర్జాతీయంగా ఖ్యాతి పొందారన్నారు. ఈ సర్జరీకి కాళ్లలోఎలాంటి కోతలు అవసరం లేదు. కేర్ హాస్పిటల్ బంజారాహిల్స్ అద్భుతమైన ఫలితాలతో ఈ హై-ఎండ్కరోనరీ బైపాస్ సర్జరీని నిర్వహించడానికి అవసరమైన అత్యాధునిక మౌలిక సదుపాయాలను కలిగి ఉందన్నారు . రోగి కుమారుడు డాక్టర్.భట్నాగర్ మరియు కేర్ హాస్పిటల్స్ బంజారాహిల్స్యొక్క వైద్య బృందానికి మరియు కేర్ హాస్పిటల్స్ యొక్క అన్ని సహాయక సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.

Exit mobile version