భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిత్యం విదేశాల్లోనే కనిపిస్తుంటారు. అప్పుడప్పుడు భారత్ లో పర్యటిస్తుంటారు అని అప్పట్లో ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించారు. ప్రపంచంలో భారత్ ను అగ్రస్థానంలో నిలబెట్టడానికి, పెట్టుబడులు తీసుకురావడానికే మోడీ విదేశాల్లో పర్యటిస్తూ కష్టపడుతున్నారని బీజేపీ నేతలు వారికి కౌంటర్ ఇచ్చేవారు.
Also Read : Food Poisoning : ఆవురావురు మంటూ రసగుల్లా తిన్నారు.. ఆస్పత్రిలో పడ్డారు
మోదీ 2014లో ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఇప్పటివరకు ఎన్ని విదేశీ పర్యటనలు చేశారో మీకు తెలుసా? భారత్ నుంచి విదేశాలకు మోడీ 68 సార్లు వెళ్లారు. తొమ్మిదేళ్లలో మొత్తం ప్రపంచంలోని 64 దేశాలు పర్యటించినట్లు తెలుస్తోంది. అయితే, తాజాగా తన 68వ విదేశీ పర్యటనలో ప్రధాని మోడీ.. జపాన్, పాపువా న్యూ గినియా, ఆస్ట్రేలియాలో ఆయా దేశాల అధినేతలను, ప్రధానులను కలిశారు. పలు దేశాల్లో పర్యటనలు ధ్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి చేస్తే, మరికొన్ని పర్యటనలు జీ 7, జీ 20, క్వాడ్ వంటి కూటముల సదస్సుల కోసం మోడీ వెళ్లారు.
Also Read : Rohit Sharma: మాకు స్టార్లు అవసరం లేదు.. మేమే తయారు చేస్తాం..
మోడీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశాక మొట్టమొదటిసారి భూటాన్ లో పర్యటించారు. ఆ తర్వాత బ్రిక్స్ సదస్సు కోసం బ్రెజిల్ కు వెళ్లారు.. మోడీ ఎక్కువసార్లు అమెరికా, జపాన్ దేశాల్లోనే పర్యటించారు. ఆ రెండు దేశాలకు ఏడు సార్ల చొప్పున వెళ్లి వచ్చారు. అనంతరం ఫ్రాన్స్, జర్మనీ దేశాల్లో ఆరేసి సార్ల చొప్పున పర్యటించారు. చైనా, నేపాల్, రష్యాల్లో ఐదుసార్లు మోడీ పర్యటించారు. 2020 ఏడాది కరోనా టైంలో మాత్రం విదేశీ పర్యటన ఒక్కటీ చేయలేదు. కరోనా ప్రభావం తగ్గిన ఏడాది నుంచి మళ్లీ విదేశీ పర్యటనలు కొనసాగిస్తున్నారు.