Minor Girl Harassment: 9 ఏళ్ల బాలికతో అసభ్య ప్రవర్తన.. నిందితుడిపై దాడి, ఆస్పత్రిలో మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minor Girl Harassment: హైదరాబాద్‌లోని కుల్సుంపుర పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలనం రేపిన ఘటన వెలుగులోకి వచ్చింది. 9 ఏళ్ల మైనర్ బాలికతో ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ బయటకు రావడంతో బాలిక తల్లిదండ్రులు, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఘటనపై అందిన సమాచారం ప్రకారం.. కుల్సుంపుర పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇందిరమ్మ డబుల్ బెడ్రూమ్ కాలనీలో F బ్లాక్‌లో నిందితుడు హాజిజ్ అబ్దుల్, బాధిత బాలిక కుటుంబం నివాసం ఉంటున్నారు. హాజిజ్ అబ్దుల్ నీలోఫర్ ఆస్పత్రి వద్ద టీ విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నాడు. బాధిత బాలిక నాలుగో తరగతి చదువుతుండగా.. ఆమె తల్లిదండ్రులు ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు.
Also Read
- Rohit Sharma Retirement: రోహిత్ శర్మ రిటైర్మెంట్కు రంగం సిద్ధం..? చివరి వన్డే ఇదేనా..!
- England vs India 2nd ODI: భారత్ విజయాన్ని అడ్డుకున్న జో రూట్...! కోహ్లీ, అయ్యర్ పోరాటం వృథా..
- Astrology: జూలై 17 శుక్రవారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని శుభవార్త..
- Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
నిందితుడు బాలికకు ముద్దు పెట్టడం, ప్రైవేట్ భాగాలను తాకుతూ అసభ్యంగా ప్రవర్తించిన ఘటన సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ కాగా.. ఈ దృశ్యాలను చూసిన బాలిక తల్లిదండ్రులు, స్థానికులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఈ సంఘటనతో ఆగ్రహానికి గురైన బాలిక కుటుంబ సభ్యులు, స్థానికులు కలిసి నిందితుడిపై దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన హాజిజ్ అబ్దుల్‌ను ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై కుల్సుంపుర పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు, ఇతర ఆధారాలను సేకరిస్తూ ఘటనకు సంబంధించిన అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు.
తాజావార్తలు
-
Minor Girl Harassment: 9 ఏళ్ల బాలికతో అసభ్య ప్రవర్తన.. నిందితుడిపై దాడి, ఆస్పత్రిలో మృతి
-
Jana Nayagan Release : జననాయగన్ దెబ్బకు బిచాణా ఎత్తేస్తోన్న సినిమాలు
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ రిటైర్మెంట్కు రంగం సిద్ధం..? చివరి వన్డే ఇదేనా..!
-
NEET UG Result 2026: నీట్ యూజీ ఫలితాలు వచ్చేశాయ్.. స్కోర్‌కార్డ్‌ను ఇలా డౌన్లోడ్ చేసుకోండి
-
England vs India 2nd ODI: భారత్ విజయాన్ని అడ్డుకున్న జో రూట్…! కోహ్లీ, అయ్యర్ పోరాటం వృథా..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్‌లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్‌లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!