NTV Telugu Site icon

IPS Officers Transferred: ఏపీలో పలువురు ఐపీఎస్‌ల బదిలీ..

Ap

Ap

IPS Officers Transferred: ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కీలక అధికారుల బదిలీలు కొనసాగుతూనే ఉన్నాయి.. ఇప్పటికే పలువురు ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులకు బదిలీలు జరిగాయి.. ఇక, ఈ రోజు భారీ సంఖ్యలో ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు బదిలీ అయ్యారు.. సాయంత్రం 19 మంది ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం.. రాత్రికి పలువురు ఐపీఎస్‌ అధికారులను కూడా బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది..

Read Also: Lavanya Parents Interview: అల్లుడు తిరిగొస్తే చాలు.. కన్నీళ్లు పెట్టుకున్న లావణ్య పేరెంట్స్

ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం..
* ఎస్పీఎఫ్ డీజీగా అంజనా సిన్హాకు అదనపు బాధ్యతలు అప్పగింత..
* అగ్నిమాపక శాఖ డీజీగా మాదిరెడ్డి ప్రతాప్.
* శాంతి భద్రతల ఐజీగా సీహెచ్ శ్రీకాంత్.
* ప్రొవిజెన్స్ లాజిస్టిక్స్ ఐజీగా పీహెచ్‌డీ రామకృష్ణ.
* పోలీసు నియామక బోర్డు చైర్మన్‌గా పీహెచ్‌డీ రామకృష్ణకు పూర్తి అదనపు బాధ్యతలు.
* విజయవాడ సీపీగా ఎస్వీ రాజశేఖర్‌బాబు.
* విశాఖ రేంజ్ డీఐజీగా గోపీనాథ్ జెట్టి.
* కర్నూలు రేంజ్ డీఐజీగా కోయ ప్రవీణ్.
* డీజీపీ ఆఫీసులో రిపోర్టు చేయాలని విశాల్ గున్ని, విజయరావులకు ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం.