NTV Telugu Site icon

Viral Video: మూడో తరగతి అమ్మాయికి గుండెపోటు.. పాఠశాల ప్రాంగణంలోనే.. (వీడియో)

Viral Video

Viral Video

Viral Video: ప్రస్తుత రోజులలో ఏ సమయాన ఏమి జరుగుతుందో ఎవరికి అర్థం కాని పరిస్థితి. ఇంటి నుంచి బయటకు వెళ్లిన వారు సురక్షితంగా ఇంటికి వస్తారన్న నమ్మకం రోజురోజుకి లేకుండా అయిపోతుంది.. కాలక్రమన వెళ్తున్న మార్గంలో రోడ్ యాక్సిడెంట్ల వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోతూ ఉంటే.. మరికొందరు గుండెపోట్ల వల్ల మరణిస్తున్నారు. మరోవైపు విద్యార్థులు స్కూల్లో అనుకోని సంఘటనల వల్ల వాళ్లు ప్రాణాలు కోల్పోవడం లాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. అయితే, తాజాగా అహ్మదాబాద్ లో 8 ఏళ్ల బాలిక ఆకస్మాత్తుగా మృతి చెందింది. మూడో తరగతి చదువుతున్న ఆ అమ్మాయి స్కూలుకు వెళ్లగానే చాతి నొప్పి అని ఫిర్యాదు చేసి కుర్చీలో కూర్చొని ఉన్నట్టుండి వెంటనే కుప్పకూలిపోయి మృతి చెందింది. సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు కి వెళ్తే..

Also read: Kane Williamson: ఐపీఎల్ ఛీ..పో.. అంది.. అక్కడ మాత్రం అరంగేట్రం మ్యాచ్‌లోనే హాఫ్ సెంచరీ

అహ్మదాబాద్ లోని థాల్తేజ్ ప్రాంతంలోని జెబార్ స్కూల్‌లో 8 సంవత్సరాలు గల గార్గి అనే అమ్మాయి మూడవ తరగతి చదువుతూ ఉంది. ఈ క్రమంలో రోజువారిగా గార్గి పాఠశాలకు చేరుకున్న అనంతరం చాతినొప్పి అని టీచర్స్ తో తెలిపింది.. ఈ క్రమంలో రిసెప్షన్ బయట కూర్చులో కూర్చొని ఒక్కసారిగా కుప్పకూలిపోయింది.. వెంటనే పాఠశాల సిబ్బంది ప్రధమ చికిత్స చేసి ఆసుపత్రికి తరలించిన అనంతరం మృతి చెందింది.. నిజానికి గార్గి అస్వస్థకు గురై ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడుతున్నట్లు మనం సీసీ కెమెరాలో చూడవచ్చు. ఇక మరోవైపు, అమ్మాయి మరణానికి ప్రాథమిక నివేదికలో హార్ట్ ఎటాక్ గా తెలుస్తుంది. అయితే, ఆ అమ్మాయికి సాధారణ వ్యాధులకు మించి పెద్దగా ఆరోగ్య సమస్యలు లేవని సమాచారం.

వాస్తవానికి గార్గి ముంబాయి వాసి. కానీ, అహ్మదాబాద్ లోని తన తాతయ్య ఇంట్లో ఉంటూ విద్యను అభ్యసిస్తుంది.. ఇక సంఘటనను మొత్తం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేయడం మొదలుపెట్టారు. మరణానికి కారణాన్ని నిర్ధారించడానికి కోసం ఆ పాప మృతి దేహాన్ని పోస్టుమార్టం కోసం పంపించినట్లు సమాచారం. అయితే, ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొడుతుంది.. ఇక ఈ వీడియోని చూసిన చాలా మంది వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.. చిన్నవయసులోనే ఇలాంటి ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని కొంతమంది కామెంట్ చేస్తూ ఉంటే.. మరికొందరు ఆ అమ్మాయికి సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.

Show comments