Oil Free Tiffins: ఒక్క చుక్క నూనె ఉపయోగించకుండా జస్ట్ 5 నిమిషాల్లోనే చేసే 8 రకాల టేస్టీ టిఫిన్స్ ఇవే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Oil Free Tiffins: ఇంట్లో నూనె అయిపోయినప్పుడు ఏం చేయాలో అర్థం కాక చాలా మంది తెగ టెన్షన్ పడుతుంటారు. కానీ, ఇప్పుడు అలాంటి ఇబ్బంది లేకుండా.. ఒక్క చుక్క నూనె కూడా లేకుండా, జస్ట్ 5 నిమిషాల్లో తయారు చేసుకునేలా టేస్టీగా, ఆరోగ్యకరంగా ఉండే టిఫిన్స్ ను సిద్ధం చేసుకోవచ్చు. ఇవి తక్కువ పదార్థాలతో ఈజీగా తయారు అవుతాయి. రుచి మాత్రమే కాదు.. ఆరోగ్యానికి కూడా ఇవి చాలా మంచివి. మరి ఆలస్యం ఎందుకు? నూనె లేని ఈ టిఫిన్స్‌ను మీరు కూడా ఒకసారి ప్రయత్నించండి..
Read Also: Sergio Gor: ఢిల్లీలో గ్రాండ్‌గా అమెరికా రాయబారి విందు.. హాజరైన రాజకీయ ప్రముఖులు
Also Read
- Massive Cloud: భారత్ నుంచి చైనా వరకు భారీ మేఘాలు.. వెలుగులోకి ఉపగ్రహ చిత్రాలు
- AP High Court: స్థానిక ఎన్నికల పిటిషన్లపై విచారణ పూర్తి.. తీర్పును రిజర్వ్ చేసిన ఏపీ హైకోర్టు
- UPI: పెట్రోల్ బంకులకు ఊరట.. UPI ఛార్జీలపై కేంద్రం కీలక నిర్ణయం!
- Uttar Pradesh: బరేలీ అల్లర్ల నిందితుడి ఇంటికి కాంగ్రెస్ అధ్యక్షుడు.. ముస్లిం ఓట్లే టార్గెట్.!
1. మసాలా పాపడ్
మీకు నచ్చిన పండ్లను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక పెద్ద గిన్నెలో వేసుకోవాలి. అందులో చాట్ మసాలా, కొంచెం ఉప్పు, నిమ్మరసం వేసి మంచిగా కలుపుకోవాలి.. రుచికరమైన ఫ్రూట్ చాట్ రెడీ అవుతుంది.. మీ ఇష్టం మేరకు ఏ పండునైనా జత చేసుకోవచ్చు.
2. పెసర్ల చాట్
పెసర్లను బాగా కడిగి 30- 35 నిమిషాలు నానబెట్టుకోవాలి.. ఆ తర్వాత కుక్కర్ లేదా పాన్‌లో నీళ్లు పోసి ఉడికించాలి.. ఉడికిన పెసర్లు చల్లారిన తర్వాత ఒక గిన్నెలో ఉల్లిపాయ, టమాటా, పచ్చి మిర్చి, ఉప్పు, నిమ్మరసం, కొత్తిమీర వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.. పోషకాలతో నిండిన పెసర్ల చాట్ రెడీ.
Read Also: Indraja: వినూత్న పాత్రలో సీనియర్ నటి ఇంద్రజ!
3. భేల్ పూరి
ఒక పెద్ద గిన్నెలో 2 కప్పుల మరమరాలు, సన్నగా తరిగిన ఉల్లిపాయ, టమాటా, ఉడికించిన బంగాళాదుంప ముక్కలు, పచ్చిమిర్చి, ఉడికబెట్టిన శనగలు జోడించుకోవాలి.. అవసరమైనంత ఉప్పు, నిమ్మరసం, కొత్తిమీరను బాగా కలపాలి.. నూనె లేకుండా తయారు అయ్యే భేల్ పూరి టేస్ట్ చాలా బాగుంటుంది.
4. మసాలా మొక్కజొన్న
మొక్కజొన్న గింజలను బాగా ఉడకబెట్టి.. అనంతరం నీరు వడకట్టి ఒక గిన్నెలో వేసి చల్లార్చుకోవాలి.. అందులో కారం, చాట్ మసాలా, ఉప్పు, నిమ్మరసం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.. వేడివేడిగా మసాలా కార్న్ సర్వ్ చేయండి.
5. ఫ్రూట్ చాట్
ఒక గిన్నెలో తరిగిన ఉల్లిపాయ, టమాటా, పచ్చి మిర్చి, కొత్తిమీరను వేసి కలుపుకోవాలి.. అందులో కొద్దిగా ఉప్పు, నిమ్మరసం వేసి మిక్స్ చేసి.. పాపడ్‌ను నిప్పులపై కాల్చి ప్లేట్‌లో పెట్టి, పైగా ఈ కూరగాయల మిశ్రమాన్ని జత చేయాలి.. సాయంత్రం స్నాక్‌గా లేదా మీకు నచ్చిన పానీయాలతో దీన్ని ఆస్వాదించవచ్చు.
Read Also: India vs Pakistan: భారత్తో మ్యాచ్ ఆడేందుకు పాక్ సర్కార్ గ్రీన్ సిగ్నల్.. ఇక, 15న దబిడి దిబిడే
6. మొలకలు సలాడ్
మొలకెత్తిన శనగలు, పెసర్లు, ఉల్లిపాయ, టమాటా, పచ్చి మిర్చి, కొత్తిమీర ఒక గిన్నెలో వేసి బాగా కలుపుకోవాలి.. లాస్ట్ లో ఉప్పు, నిమ్మరసం జత చేయాలి. ఇది ఆరోగ్యకరమైన స్నాక్స్ మాత్రమే కాదు.. అల్పాహారంగా కూడా దీన్ని తీసుకోవచ్చు.
7. ఓట్స్ సలాడ్
ఓట్స్, పాలు, చియా గింజలు, అవిసె గింజలు, డ్రై ఫ్రూట్స్, పండ్లను ఒక గాజు గిన్నెలో వేసి రాత్రంతా ఫ్రిజ్‌లో పెట్టి.. మార్నింగ్ నిద్ర లేవగానే.. తేనె వేసి బాగా కలిపి సర్వ్ చేయాలి.. హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌కు ఇది బెస్ట్ ఆప్షన్..
8. స్పైసీ పైనాపిల్
ఒక గిన్నెలో ఫైనాపిల్ ముక్కలు, నిమ్మరసం, నల్ల మిరియాల పొడి, పింక్ సాల్ట్, చిటికెడు దాల్చిన చెక్క పొడి వేసి మంచిగా కలపాలి. కేవలం రెండు నిమిషాల్లో స్పైసీ పైనాపిల్ సాలాడ్ సిద్ధమవుతుంది.
తాజావార్తలు
-
Massive Cloud: భారత్ నుంచి చైనా వరకు భారీ మేఘాలు.. వెలుగులోకి ఉపగ్రహ చిత్రాలు
-
AP High Court: స్థానిక ఎన్నికల పిటిషన్లపై విచారణ పూర్తి.. తీర్పును రిజర్వ్ చేసిన ఏపీ హైకోర్టు
-
UPI: పెట్రోల్ బంకులకు ఊరట.. UPI ఛార్జీలపై కేంద్రం కీలక నిర్ణయం!
-
Sorakaya Sarvapindi: టేస్టీతో పాటు సూపర్ హెల్తీ.. ఘుమఘుమలాడే ‘సొరకాయ సర్వపిండి’ తింటే ఎన్ని లాభాల్లో తెలుసా?
-
Uttar Pradesh: బరేలీ అల్లర్ల నిందితుడి ఇంటికి కాంగ్రెస్ అధ్యక్షుడు.. ముస్లిం ఓట్లే టార్గెట్.!
ట్రెండింగ్
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!