Site icon NTV Telugu

Good News: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. భారీగా పెరగనున్న డీఏ

7th Pay Commission

7th Pay Commission

Good News: డీఏ కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త విన్పించనుంది. త్వరలో డీఏను మరోసారి 4 శాతం పెంచవచ్చని తెలుస్తోంది. అంటే ఇప్పుడు అందుతున్న 38 శాతం డీఏకు అదనంగా మరో 4 శాతం చేరి..42 శాతం కానుంది. ప్రతి నెలా జారీ అయ్యే సీపీఐ సూచీ ప్రకారం అంటే వినియోగదారుల సూచీ ఆధారంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్ దారులకు కరవుభత్యం పెరుగుతుంటుంది. కేంద్ర కార్మిక శాఖ ఈ సూచీని విడుదల చేస్తుంటుంది. గత ఏడాది అంటే 2022 డిసెంబర్ నెల సూచీ ప్రకారం 4.3 శాతం డీఏ లెక్క వేశారు. అందుకే కేంద్ర ప్రభుత్వం ఈసారి డీఏను 4 శాతం పెంచవచ్చని అంచనా ఉంది.

రాబడిని పరిగణనలో తీసుకుని డీఏ పెంపు ప్రతిపాదనను కేంద్ర ఆర్ధిక శాఖ..కేబినెట్ ఆమోదానికి పంపిస్తుంటుంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారులు 38 శాతం డీఏ తీసుకుంటున్నారు. బుధవారం కేంద్ర మంత్రివర్గ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో, ఉద్యోగుల డీఏ అలవెన్స్‌పై ఆమోద ముద్ర పడవచ్చు. దానితో పాటు పెరిగిన డీఏను కూడా ప్రకటించవచ్చు. అందువల్ల మార్చి నెల జీతంలో క్రమంగా పెరుగుదల ఉంటుంది. కేంద్ర ఉద్యోగుల జీతం రూ.27312 మేర పెరిగే అవకాశం ఉందని వర్గాల సమాచారం. మార్చి 1న మంత్రివర్గం సమావేశం కానుంది. డీఏకు క్యాబినెట్ ఆమోదం తెలిపిన తర్వాత డియర్‌నెస్ అలవెన్స్‌లో భారీగా పెంపుదల ఉంటుంది. ఉద్యోగి ఖాతాలో పెద్ద మొత్తం జమ అవుతుంది. అలాగే ఉద్యోగులకు జనవరి, ఫిబ్రవరి నెలల బకాయిలు అందుతాయి. డీఏను 4 శాతం పెంచడం వల్ల ఉద్యోగుల జీతం నెలకు రూ.720 నుంచి రూ.2276కి భారీ ప్రయోజనం చేకూరుతుంది.

Read Also: Anand Mahindra: కలిసి పనిచేద్దాం.. బిల్ గేట్స్‎తో ఆనంద్ మహీంద్రా

ఒక ఉద్యోగి మూల వేతనం రూ.18000 అయితే అతని జీతం నెలకు రూ.720 పెరుగుతుంది. ఉద్యోగి జీతం ఏడాదికి మొత్తం రూ.8640 పెరుగుతుంది. కాబట్టి ఒక ఉద్యోగి మూల వేతనం నెలకు రూ. 56900 అయితే, అతని జీతంలో నెలకు రూ. 2276 ప్రయోజనం పొందుతారు. ఉద్యోగి జీతం ఏడాదికి మొత్తం రూ.27312 పెరుగుతుంది.

Read Also: Sachin Tendulkar : సచిన్ టెండూల్కర్ @50.. ‎బర్త్ డే గిఫ్ట్‎గా భారీ విగ్రహం

ఉద్యోగుల డీఏ 4 శాతం పెరిగితే అది ప్రస్తుతమున్న దానితో కలుపుకుంటే 42 శాతానికి చేరుతుంది. అయితే జూలై 2022లో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల డీఏను 4 శాతం పెంచింది. డీఏ, డీఆర్‌ల పెంపుదల వల్ల దేశవ్యాప్తంగా లక్షలాది మంది కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లు లబ్ధి పొందనున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల ఒత్తిడితో కేంద్ర ప్రభుత్వం నిస్సహాయంగా మారింది. ఇప్పటి వరకు కేంద్రం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఈ పథకం ఖజానాకు గండి కొట్టడమేనన్నారు. కానీ ఇప్పుడు స్వరం కాస్త మెత్తబడింది. కొత్త పింఛను పథకంపై ఉన్న అసంతృప్తిని తొలగించేందుకు మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అందుకోసం ఈ కొత్త పథకంలో మరిన్ని సౌకర్యాలు కల్పించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. కొత్త పెన్షన్ స్కీమ్‌ను సంస్కరించే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు కచ్చితమైన వార్తలు వచ్చాయి.

Exit mobile version