గ్రేటర్ నోయిడాలో ( Greater Noida) ఫుడ్ పాయిజన్ (Food poisoning) కలకలం రేపింది. హాస్టల్‌లో కలుషిత ఆహారం తిని 76 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో హుటాహుటిన వసతి గృహం సిబ్బంది ఆస్పత్రికి తరలించారు.
ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలోని ఓ ప్రైవేట్ హాస్టల్‌లో మహాశివరాత్రి వ్రతాన్ని ఆచరించారు. విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన భోజనాన్ని తిన్న తర్వాత 76 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఫుడ్ పాయిజన్ కారణంగానే అస్వస్థతకు గురైనట్లు పోలీసులు తెలిపారు.
వివిధ కాలేజీలకు చెందిన విద్యార్థులు నాలెడ్జ్ పార్క్ ప్రాంతంలోని ఆర్యన్ రెసిడెన్సీలో ఉంటున్నారు. శుక్రవారం రాత్రి భోజనం చేసిన తర్వాత వారిలో చాలా మందికి అసౌకర్యం, కళ్లు తిరగడం, వాంతులు అయ్యాయని పోలీసులు తెలిపారు. మహాశివరాత్రి సందర్భంగా తయారు చేసిన పూరీలను వారు తిన్నట్లు పోలీసులు వెల్లడించాతరు. ప్రస్తుతం విద్యార్థులంతా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు వెల్లడించారు.
