NTV Telugu Site icon

Ravneet Singh: 700 కోట్లతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ది పనులు చేపట్టాం

Ravneet Sing

Ravneet Sing

కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి రవ్ణీత్ సింగ్, దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ ఈరోజు రి కన్స్ట్రక్షన్ అవుతున్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా రైల్వే కేంద్ర సహాయ మంత్రి రవ్ణీత్ సింగ్ మాట్లాడుతూ.. 712 కోట్లతో మొదటి విడత స్టేషన్ అభివృద్ది పనులు కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు. అధునాతనమైన టెక్నాలజీ అంతర్జాతీయ విమానాశ్రయ తరహాలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. ప్లాట్ ఫామ్ లకు రూఫ్ టాప్ లు, పార్కింగ్ స్థలాలు ఏసి వెయిటింగ్ హాల్స్, స్టేషన్ రెండువైపులా కొత్త బిల్డింగులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. 2026 కల్లా పనులు మొత్తం పూర్తి కావాలి అని లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన తెలిపారు. ఇప్పటివరకు 27 శాతం పనులు పూర్తి అయ్యాయని, చర్లపల్లి స్టేషన్ పనులు శరవేగంగా సాగి పూర్తి అయ్యాయన్నారు రవ్ణీత్ సింగ్.

  Viral Video: మహిళా ప్రిన్సిపాల్ చెంప పగలగొట్టిన విద్యార్థి.. వీడియో వైరల్

అంతేకాకుండా..’చర్లపల్లి స్టేషన్ ప్రారంభానికి సిద్దంగా ఉంది. సికింద్రాబాద్ స్టేషన్లో సోలార్ ప్యానల్ ఏర్పాటు చేస్తున్నాం. నీళ్ళ సదుపాయం పెంచేందుకు పెద్ద యెత్తున వాటర్ ట్యాంకు లు సిద్దం చేస్తున్నాం. కొత్త ప్లాట్ ఫామ్స్, లిఫ్టులు, వైయిటింగ్ హాల్స్, పార్కింగ్ స్థలాలు అభివృద్ది కూడా జరుగుతుంది. ప్రధాని మోడీ అమృత్ భారత్ స్టేషన్ లో భాగంగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఉన్న 119 రైల్వే స్టేషన్లను 5000 కోట్లతో అభివృద్ది చేయాలని సూచించారు. అందులో భాగంగానే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా అభివృద్ది చేస్తున్నాం. లక్షల మంది ప్రయాణికులు సికింద్రబాద్ నుంచి ప్రయాణం చేస్తున్నారు. అందుకే మొదటగా ఇది ఎంపిక చేశాం. నాంపల్లి,చర్లపల్లి సహా ఇంకా చాలా స్టేషన్ లు అభివృద్ది జరుగుతుంది.’ అని రవ్ణీత్ సింగ్ అన్నారు.

Crime: మదర్సాలో షాకింగ్ ఘటన.. సెలవు కోసం 5 ఏళ్ల చిన్నారి హత్య!.. నిందితులు 11, 9ఏళ్ల చిన్నారులే..