Modi 3.0 Cabinet: భారత ప్రధాన మంత్రిగా నరేంద్ర మోడీ మూడోసారి ప్రమాణస్వీకారం చేశారు. మోడీతో పాటు మరో 71 మంది కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేసేశారు. అయితే, మోడీ3.0 మంత్రివర్గంలో ఏడుగురు మహిళలకు చోటు కల్పించారు. కానీ, గతంలో కేబినేట్ లో 10 మంది మహిళలకు స్థానం దక్కింది. గతంలో కేంద్ర మంత్రులుగా పని చేసిన స్మృతి ఇరానీ, డాక్టర్ భారతీ పవార్, సాధ్వి నిరంజన్ జ్యోతి, దర్శన జర్దోష్, మీనాక్షి లేఖి, ప్రతిమా భూమిక్ లకు అవకాశం ఇచ్చారు.
Read Also: Etela Rajender: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఈటల.. అమిత్ షాతో భేటీ అనంతరం ప్రకటించే చాన్స్..
ఇక, రాజ్యసభ ఎంపీ నిర్మలా సీతారామన్ మరోసారి మంత్రి మండలిలో ఛాన్స్ దొరికింది. గత ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా ఆమె పని చేసింది. ఇక, తాజా మంత్రివర్గంలోకి ఝార్ఖండ్ కు చెందిన ఓబీసీ నాయకురాలు, బీజేపీ నేత అన్నపూర్ణాదేవి, మధ్యప్రదేశ్ కు చెందిన గిరిజన నాయకురాలు సావిత్రి ఠాకూర్, గుజరాత్ కు చెందిన బీజేపీ నాయకురాలు నిముబెన్ బంభానియా, మహారాష్ట్రకు చెందిన రక్షా ఖడ్సే, కర్ణాటకకు చెందిన శోభా కరంద్లాజే, అప్నాదళ్ నాయకురాలు, కుర్మీ కమ్యూనిటీకి చెందిన నేత అనుప్రియా పటేల్ కేబినేట్ లో స్థానం దక్కించుకున్నారు.