NTV Telugu Site icon

Siddhnath Temple: ఆలయంలో భారీ తొక్కిసలాట.. ఏడుగురు భక్తులు మృతి!

Bihar Stampede

Bihar Stampede

7 Dead in a stampede in Bihar: బిహార్‌లోని జెహానాబాద్‌ జిల్లా మగ్ధుంపూర్‌లోని బాబా సిద్ధనాథ్‌ ఆలయంలో సోమవారం తెల్లవారుజామున తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఏడుగురు భక్తులు అక్కడిక్కడే మృతి చెందారు. 10 మందికి పైగా గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో ఆరుగురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నాడు.

ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని జెహనాబాద్ జిల్లా మేజిస్ట్రేట్ అలంకృత పాండే సోమవారం ఉదయం తెలిపారు. మృతుల వివరాలను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని, అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించనున్నట్లు చెప్పారు. గాయపడిన వారిని మగ్ధుంపూర్‌, జెహనాబాద్‌లోని ఆసుపత్రులకు తరలించామని పేర్కొన్నారు.

Also Read: Paris Olympics 2024: ముగిసిన పారిస్‌ ఒలింపిక్స్‌.. 40 స్వర్ణాలతో టాప్‌లో అమెరికా! భారత్ స్థానం ఎంతంటే

ఈ ఘటన మమగ్ధుంపూర్‌ బ్లాక్ వానావర్ కొండ వద్ద చోటుచేసుకుంది. పవిత్ర శ్రావణ మాసంలో నాలుగో సోమవారం కావడంతో ఆలయంలో రద్దీ నెలకొంది. ఎక్కువ మంది భక్తులు రావడంతోనే తొక్కిసలాటకు దారితీసింది. 80,000 మంది బాబా సిద్ధనాథ్‌ ఆలయంకు వచ్చినట్లు తెలుస్తోంది.

 

Show comments