Site icon NTV Telugu

7/G Brundavan Colony Sequel : షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనా..?

Whatsapp Image 2023 08 24 At 3.26.49 Pm

Whatsapp Image 2023 08 24 At 3.26.49 Pm

7/G బృందావన కాలనీ.. ఈ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.2004లో తెలుగు మరియు తమిళ భాషల్లో విడుదల అయ్యి.. రెండు భాషల్లో బాక్సాఫీస్‌ వద్ద బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ఈ సినిమాలో రవి కృష్ణ, సోనియా అగర్వాల్‌ హీరో హీరోయిన్ లుగా నటించారు. వారిద్దరి కెరీర్ లో 7/G బృందావన్ కాలనీ ల్యాండ్ మార్క్‌ సినిమాగా నిలిచిపోయింది. ఈమూవీ తమిళంలో 7/G రెయిన్‌బో కాలనీ టైటిల్‌తో విడుదలైంది. ఈ సినిమా అప్పట్లో యూత్ కి తెగ నచ్చేసింది. ఇప్పటికీ ఈ సినిమా ఒక సెన్సేషన్ అని చెప్పొచ్చు. ఈ సినిమాను డైరెక్టర్ సెల్వ రాఘవన్ అద్భుతంగా తెరకెక్కించారు.ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా అద్భుతమైన మ్యూజిక్ అందించారు. ఈ సినిమాలో పాటలు ఇప్పటికీ చాలా పాపులర్..అయితే ఈ సినిమాను సెప్టెంబర్ 22న మరోసారి థియేటర్స్ లో రీ రీలిజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. మరి రీ రిలీజ్ లో ఈ సినిమా ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఇంకో ఆసక్తి కర విషయం ఏమిటంటే ఈమూవీకి సీక్వెల్ అంటూ చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి.

తాజాగా ఈమూవీ సీక్వెల్ షూటింగ్ పై ఓ న్యూస్ బాగా వైరల్ అవుతుంది. అయితే ఈ ఆల్‌టైమ్‌ సూపర్ హిట్‌ సినిమాకు సీక్వెల్‌ను తెరకెక్కించనున్నట్టు నిర్మాత ఏఎం రత్నం ఇప్పటికే క్లారిటీ కూడా ఇచ్చేశారు. అయితే మూవీ ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్తుంది అనేది మాత్రం గతంలో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ఈక్రమంలో ఇప్పుడు ఈ క్రేజీ సినిమా సీక్వెల్‌ న్యూస్ ఒకటి నెట్టింట బాగా వైరల్ అవుతుంది.తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర షూటింగ్ సెప్టెంబర్ మొదటివారం నుంచి మొదలు అవ్వనున్నట్లు సమాచారం. ఈ సీక్వెల్‌కు కుడా సెల్వ రాఘవన్ దర్శకత్వం వహించబోతున్నట్లు తెలుస్తుంది.. లవ్‌ టుడే ఫేం ఇవానా మరియు అదితి శంకర్‌ పేర్లు ఫీ మేల్‌ లీడ్ రోల్‌ కోసం తీసుకోనున్నట్లు సమాచారం అయితే ఈసీక్వెల్‌లో మరోసారి రవికృష్ణ హీరోగా కనిపించనున్నట్టు తెలుస్తోంది. సెల్వరాఘవన్‌ ఈమూవీని మరింత డిఫరెంట్ గా ప్లాన్ చేశాడని సమాచారం.నిర్మాత ఏఎం రత్నం త్వరలోనే ఈ సీక్వెల్ కు సంబంధించి ఇతర వివరాలపై క్లారిటీ ఇవ్వనున్నట్టు సమాచారం..

Exit mobile version