మహారాష్ట్రలోని పూణెలో 11 ఏళ్ల విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడిన షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. సమాచారం ప్రకారం.. ఐదో తరగతి చదువుతున్న విద్యార్థినితో 67 ఏళ్ల వ్యక్తి అసహ్యకరంగా ప్రవర్తించాడు. బాధిత కుటుంబీకుల ఫిర్యాదు మేరకు పోలీసులు దిలీప్ నామ్‌దేవ్ అనే వృద్ధుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాలికల భద్రతను దృష్టిలో ఉంచుకుని శనివారం పాఠశాలలో గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌పై వర్క్‌షాప్ జరుగుతోంది.
READ MORE: Demand Courses: ఈ కోర్సులకు భారీగా డిమాండ్.. లక్షల్లో జీతాలు?
ఈ సమయంలో వరుసకు మామ అయిన 67ఏళ్ల వృద్ధుడు తనతో అసభ్యంగా ప్రవర్తించాడని విద్యార్థిని తన టీచర్‌కు చెప్పింది. తిండికి డబ్బులు ఇచ్చి మామ ఇంటికి తీసుకెళ్లి తనతో తప్పుడు పనులు చేశాడని విద్యార్థిని ఉపాధ్యాయురాలికి చెప్పింది. విద్యార్థిని చెప్పింది విని ఆశ్చర్యపోయిన ఉపాధ్యాయురాలు జరిగిన విషయాన్ని ప్రిన్సిపాల్‌కు తెలిపింది. దీంతో వెంటనే బాలిక తల్లిదండ్రులను పాఠశాలకు పిలిపించి సమాచారం అందించారు. ఉపాధ్యాయ సంఘాల సభ్యులతో చర్చించిన అనంతరం హవేలీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
READ MORE: QG Gang War Trailer: ‘క్యూజీ గ్యాంగ్‌వార్’ ట్రైలర్ విడుదల.. అదరగొట్టేసిన ప్రియమణి, సన్నీలియోన్
నిందితుడైన వృద్ధుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు
బాధితురాలి కుటుంబసభ్యుల నుంచి ఫిర్యాదు అందిన వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడు దిలీప్ నామ్‌దేవ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసును సీరియస్‌గా విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య ఘటనపై దేశవ్యాప్తంగా ప్రజలు నిరసనలు తెలుపుతున్నారు. ఇదిలావుండగా దేశంలోని నలుమూలల నుంచి మహిళలపై క్రూరత్వానికి సంబంధించిన వార్తలు వస్తున్నాయి.
