NTV Telugu Site icon

Russo-Ukrainian War : ప్రతీకారం తీర్చుకున్న ఉక్రెయిన్.. 63మంది రష్యన్ సైనికులు మృతి

Russia

Russia

Russo-Ukrainian War : గదిలో వేసి కొడితే పిల్లి కాస్త పులవుతుందని సామెత ఇప్పుడు ఉక్రెయిన్ దేశానికి సరిగ్గా సరిపోతుంది. చిన్న దేశాన్ని చేసి ఏడాదిగా రష్యా ఉక్రెయిన్ పై దాడులు చేస్తోనే ఉంది. రష్యా చేస్తున్న దాడులకు ఉక్రెయిన్ దేశం చిన్నాభిన్నం అయింది. అయినా ఆ దేశం కిందకు వెళ్లేది లేదని.. చివరి వరకు పోరాడుతామని ఉక్రెయిన్ అంటోంది. దాయాది దేశాల మద్దతుతో రష్యాతో పోరాడుతోనే ఉంది. ఈ క్రమంలో రష్యాపై ఉక్రెయిన్ ప్రతీకారం తీర్చుకుంటుంది. గత వారం రోజులుగా రష్యా, ఉక్రెయిన్ మధ్య దాడులు తీవ్రరూపం దాల్చాయి. రష్యా డొనెట్స్క్‌పై ఉక్రెయిన్ క్షిపణులతో దాడి చేసింది. ఉక్రెయిన్ క్షిపణి దాడిలో 63 మంది సైనికులు మరణించినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ఇంతకుముందు ఉక్రెయిన్ రక్షణ మంత్రిత్వ శాఖ తన క్షిపణి దాడిలో సుమారు 400 మంది రష్యన్ సైనికులు మరణించినట్లు ప్రకటించింది.

Read Also: Virovore : వైరస్‌లను తినే జీవి వైరోవోర్.. శాస్త్రవేత్తల ఆవిష్కరణ

రష్యా సైన్యం ఆక్రమించిన తూర్పు ఉక్రెయిన్‌లోని ఓ పాఠశాలపై ఉక్రెయిన్ దాడి చేసింది. న్యూ ఇయర్ రోజు ఈ దాడి జరిగింది. ఉక్రెయిన్ నాలుగు రాకెట్లతో దాడి చేసిందని, అందులో తమ సైనికులు మరణించారని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆదివారం (జనవరి 1) ఉక్రెయిన్ సైన్యం నూతన సంవత్సర పండుగ సందర్భంగా మాస్కో డొనెట్స్క్‌పై కనీసం 25 రాకెట్లను ప్రయోగించింది. నూతన సంవత్సరం సందర్భంగా రష్యా అధ్యక్షుడు పుతిన్‌ జాతిని ఉద్దేశించి ప్రసంగించిన కొద్ది సేపటి తర్వాత ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో రష్యా సైనికులు బస చేసిన స్థావరం పక్కనే భారీ మందుగుండు నిల్వ కేంద్రం ఉండటంతో రాకెట్‌ దాడివల్ల అన్ని సైనిక పరికరాలు కూడా ధ్వంసం అయ్యాయి. ఈ సమయంలో ఇరు దేశాల మధ్య పోరు మరింత ముదిరింది. అంతకుముందు.. రష్యా గత వారం ఉక్రెయిన్‌పై క్షిపణులు, డ్రోన్‌లతో దాడి చేసింది. రష్యా దాడిలో దాదాపు నలుగురు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు.