NTV Telugu Site icon

Miss Universe Buenos Aires: 60 ఏళ్లకు అందాల కిరీటం.. చరిత్రలోనే తొలిసారి..

Miss Universe

Miss Universe

Miss Universe: 60 ఏళ్ల వయస్సులో ఎవరైనా ఏం చేస్తు్ంటారు. మనవళ్లు, మనవరాళ్లతో ఆడుకుంటూ.. కృష్ణా రామా అంటూ కాలం వెళ్లదీస్తారు. కానీ ఓ వృద్ధురాలు మాత్రం అందం యువత సొంతం మాత్రమే కాదని నిరూపించింది. అందాల పోటీల్లో కుర్రకారు మాత్రమే గెలుస్తారన్న విశ్వాసాన్ని కూడా పటాపంచలు చేసింది అర్జెంటీనాకు చెందిన ఈ 60 ఏళ్ల అందాల భామ. అరవై ఏళ్ల వయస్సులో, చెరగని అందంతో అందాల పోటీలో నెగ్గి, రికార్డు సృష్టించింది. మిస్‌ యూనివర్స్‌ బ్యూనస్ ఎయిర్స్‌ కిరీటాన్ని గెలుచుకున్న ఆ వృద్ధురాలు.. ఈ ఏడాది మిస్ యూనివర్స్‌ పోటీల్లో పాల్గొనేందుకు కూడా సిద్ధమవుతున్నారు. ఆమె ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నారా?.

Read Also: Priyanka Gandhi: మోడీని మామయ్య అంటూ పిలిచిన ప్రియాంక గాంధీ

అర్జెంటీనాకు చెందిన 60 ఏళ్ల న్యాయవాది అలెజాండ్రా మారిసా రోడ్రిగ్జ్.. అందమైన యువతులతో పోటీ పడి మిస్ యూనివిర్స్ బ్యూనస్ ఎయిర్స్ టైటిల్ గెలిచి చరిత్ర సృష్టించింది. దీంతో 60 ఏళ్ల వయసులో ఇంతటి ప్రతిష్టాత్మక బ్యూటీ టైటిల్‌ను గెలుచుకున్న తొలి మహిళగా నిలిచింది. ఏప్రిల్ 24న జరిగిన అందాల పోటీలో గెలవడానికి ఆమె 18 నుంచి 73 సంవత్సరాల వయస్సు గల మరో 34 మందితో పోటీ పడింది. న్యాయవాది, జర్నలిస్ట్ అయిన అలెజాండ్రా.. అందాల పోటీల్లో పాల్గొనాలనే సంకల్పం ఉంటే.. దానికి వయసు అడ్డు కాదని నిరూపించారు. అంతేకాకుండా ఈ ఏడాది మే నెలలో జరగనున్న ‘మిస్‌ యూనివర్స్‌ అర్జెంటీనా’ పోటీల్లో.. అలెజాండ్రా బ్యూనస్‌ ఎయిర్స్‌ తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు. ఇక ఆ పోటీల్లో గెలిస్తే సెప్టెంబరులో మెక్సికో వేదికగా జరిగే మిస్ యూనివర్స్ 2024 పోటీల్లో అర్జెంటీనా తరఫున అలెజాండ్రా పాల్గొననున్నారు. మిస్ యూనివర్స్ బ్యూనస్ ఎయిర్స్ టైటిల్ గెలుచుకోవడంతో అలెజాండ్రా ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

అలెజాండ్రా మారిసా రోడ్రిగ్జ్ ఎవరు?
అలెజాండ్రా మారిసా రోడ్రిగ్జ్ అర్జెంటీనాలోని బ్యూనస్ ఎయిర్స్ ప్రావిన్స్ రాజధాని నగరమైన లాప్లాటాకు చెందినవారు. ఉన్నత పాఠశాల పూర్తి చేసిన తర్వాత, అలెజాండ్రా లా డిగ్రీని అభ్యసించే ముందు జర్నలిజంలో వృత్తిని ప్రారంభించారు. ఆమె అర్జెంటీనా టెలివిజన్ నెట్‌వర్క్‌తో మాట్లాడుతూ, తాను ఆసుపత్రికి న్యాయ సలహాదారుగా పాత్రను మార్చుకున్నానని చెప్పింది. అలెజాండ్రా ప్రపంచవ్యాప్త అందాల పోటీ నుండి చాలా కాలం వయస్సు నిబంధనలు ఉండడంతో పాల్గొనలేకపోయారు. అయితే 2023లో నిబంధనలు మారినప్పుడు ఆమె అభిప్రాయం మారిపోయింది. 1952లో, మిస్ యూనివర్స్ పోటీదారుల వయస్సు 18 నుండి 28 సంవత్సరాల వరకు ఉండాలి అని న్యూయార్క్ పోస్ట్ నివేదిక పేర్కొంది. వారు పిల్లలు లేకుండా ఒంటరిగా ఉండాల్సిన అవసరం ఉంది. అయితే గత ఏడాది 18 నుంచి 73 ఏళ్ల మధ్య వయసున్న మహిళలను ఏ ఇతర అంశాలతో సంబంధం లేకుండా పోటీలో పాల్గొనేందుకు అనుమతినిస్తూ ఈ పోటీల్లో తీర్పునిచ్చింది.