NTV Telugu Site icon

Harassment: ఏంట్రా ఇది.. ఆరేళ్ల బాలుడిపై మైనర్ లైంగిక దాడి

Harassment

Harassment

Harassment: హర్యానాలో గురుగ్రామ్‌లో దారుణం జరిగింది. గురుగ్రామ్‌లోని బాద్‌షాపూర్ ప్రాంతంలో ఆరేళ్ల బాలుడిపై అతని పొరుగున ఉండే 13 ఏళ్ల బాలుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని పోలీసులు సోమవారం తెలిపారు. 13 ఏళ్ల నిందితుడు 1వ తరగతి విద్యార్థిని ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లి రెండు రోజుల క్రితం దాడికి పాల్పడ్డాడని బాధిత బాలుడి తండ్రి ఆరోపించారు.

California Shooting: కాలిఫోర్నియాలో కాల్పులు.. 6 నెలల పాపతో సహా ఆరుగురు మృతి

6వ తరగతి చదువుతున్న నిందితుడు ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలుంటాయని ఆ పిల్లాడిని బెదిరించాడు. అయితే, ఆ బాలుడు ఆదివారం తన తండ్రికి ఈ విషయాన్ని వివరించగా, అతను ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. బాద్‌షాపూర్ పోలీస్ స్టేషన్‌లో పోక్సో చట్టంలోని సెక్షన్ 6 కింద ఎఫ్‌ఐఆర్ నమోదైంది. బాధితుడిని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ కౌన్సెలింగ్ చేసిన తర్వాత సోమవారం సెక్షన్ 164 కింద అతని స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేయడానికి సిటీ కోర్టులో హాజరుపరిచారు. చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని బాద్‌షాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ ఎస్‌హెచ్‌వో మదన్‌లాల్‌ తెలిపారు.

Show comments