Septic Tank: తమిళనాడులోని ఓ రిసార్ట్‌లో సెప్టిక్ ట్యాంక్‌ను శుభ్రం చేస్తుండగా విషవాయువు పీల్చి ముగ్గురు మృతి చెందారు. చెన్నైకి 47 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీపెరంబుదూర్‌లో ఈ రిసార్ట్ ఉంది. సరైన భద్రతా చర్యలు చేపట్టకుండా సెప్టిక్ ట్యాంక్‌లను శుభ్రం చేసేందుకు వచ్చిన ముగ్గురు కార్మికులు విషవాయువు పీల్చి ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. సరైన రక్షణ దుస్తులు ధరించకుండా సెప్టిక్ ట్యాంక్‌లను శుభ్రం చేయడం వల్ల దేశంలో ఇప్పటికే వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఇవాళ ఉదయం కూడా మహారాష్ట్రలో ఓ ఘటన జరిగింది.
Imran Khan: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌పై అనర్హత వేటు.. పార్లమెంటుకు ఐదేళ్లు దూరం
మహారాష్ట్రలోని పుణెలో వాఘోలి ప్రాంతంలో సొలాసియా సొసైటీకి చెందిన సెప్టిక్ ట్యాంక్‌ను క్లీన్ చేస్తుండగా ముగ్గురు కార్మికులు మృతి చెందారు. ఊపిరి ఆడకపోవడం వల్లే వారు మరణించి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఇవాళ ఉదయం 6గంటల సమయంలో 18 అడుగుల లోతు గల సెప్టిక్ ట్యాంక్‌లో ముగ్గురు కార్మికులు చిక్కుకుపోయారు. గమనించిన స్థానికులు పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని కార్మికుల మృతదేహాలను బయటకు తీశారు. ఊపిరాడకే మృతి చెందినట్లు వారు తెలిపారు. కార్మికులను నితిన్ ప్రభార్ గోండ్ (45), గణేష్ భలేరావు (28), సతీష్‌కుమార్ చౌదరిగా పోలీసులు గుర్తించారు.ఈ ఘటనపై పుణె పోలీసులు విచారణ చేపట్టారు.
