NTV Telugu Site icon

Earthquake: అర్ధరాత్రి నేపాల్‌, ఢిల్లీని వణికించిన భూకంపం.. ఆరుగురు మృతి

Earthquake

Earthquake

Earthquake: నేపాల్‌లో 6.6 తీవ్రతతో సంభవించిన భూకంపం కారణంగా 6 మంది చనిపోయారు. నేపాల్‌లో భూకంపం సంభవించడంతో భారత రాజధాని ఢిల్లీ దాని పరిసర ప్రాంతాల్లో కూడా ప్రకంపనలు సంభవించాయి. మంగళవారం అర్థరాత్రి దాటాక 1.57 గంటల సమయంలో భూమి కంపించింది. రిక్టర్‌ స్కేల్‌పై 6.3తీవ్రతగా నమోదైంది. దీంతో ఢిల్లీ సరిహద్దుల్లోని నోయిడా, గుడ్‌గావ్ ప్రాంతాల్లో పది సెకన్ల పాటు ప్రకంపనలు రాగా.. ఏం జరుగుతుందో తెలియక ప్రజలు ఇళ్ల నుంచి రోడ్లపైకి చేరుకున్నారు.

Salary Hike కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పనున్న మోదీ సర్కార్..

బుధవారం ఉదయం నేపాల్‌లో 6.6 తీవ్రతతో భూకంపం సంభవించిందని, ఆరుగురు వ్యక్తులు మరణించినట్లు ఆ దేశ భూకంప కేంద్రం తెలిపింది. నేపాల్‌లోని దోటీ జిల్లాలో భూకంపం కారణంగా ఇల్లు కూలిపోవడంతో ఆరుగురు వ్యక్తులు చనిపోయారని తెలిసింది. ఈ భూకంపం భారతదేశంలోని పొరుగు రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్‌కు ఈశాన్యంగా 158 కిమీ (98 మైళ్ళు) కేంద్రీకృతమై ఉంది. 10కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు నేషనల్ సీస్మాలజీ సెంటర్ ప్రకటించింది. నేపాల్‌లో 24 గంటల్లో రెండు సార్లు భూమి కంపించింది. అంతకుముందు మంగళవారం రాత్రి 8.52 గంటల సమయంలో 4.9 తీవ్రతతో భూమి కంపించింది. భూకంపం తర్వాత మీడియా నివేదికలు భారతదేశ రాజధాని న్యూఢిల్లీ, పరిసర ప్రాంతాలలో కూడా ప్రకంపనలు సంభవించాయని చూపించాయి. భూకంప తీవ్రత 6.3గా నమోదైనట్లు భారత జాతీయ భూకంప శాస్త్ర కేంద్రం వెల్లడించింది. యూరోపియన్-మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ (EMSC) ఇంతకుముందు భూకంప తీవ్రత 5.6గా ఉందని అంచనా వేసింది. భూప్రకంపనలు చోటుచేసుకున్న అర్ధగంటలోపే ఈ అంశం ట్విటర్‌ ట్రెండింగ్‌లోకి రావడం గమనార్హం. దాదాపు 20వేల ట్వీట్లు చేశారు.