Srisailam: ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నేటితో 5వరోజుకు చేరుకున్నాయి. ఉదయం కాణిపాకం శ్రీవరసిద్ది వినాయక దేవస్థానం శ్రీస్వామి అమ్మవార్లకు పట్టువస్త్రాలను సమర్పించనుంది. సాయంత్రం ఏపీ ప్రభుత్వం తరపున శ్రీస్వామి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. సాయంత్రం రావణవాహనంపై స్వామిఅమ్మవార్లు భక్తులకు దర్శనమివ్వనున్నారు. రావణవాహనంపై ప్రత్యేక పూజలందుకోనున్నా శ్రీస్వామి అమ్మవారు. రాత్రి క్షేత్ర వీధుల్లో ఆది దంపతుల గ్రామోత్సవం జరగనుంది. శివస్వాములతో శ్రీశైలం ఆలయం పోటెత్తింది. భక్తుల రద్దీ భారీగా పెరిగింది.
Read Also: Mahanandi: మహానంది క్షేత్రంలో ఈ నెల 6 నుంచి 11 వరకు శివరాత్రి బ్రహ్మోత్సవాలు