Andhra Pradesh Crime: ఆంధ్రప్రదేశ్‌లో దారుణమైన ఘటన వెలుగు చూసింది.. ఏలూరు జిల్లాలో ఐదో తరగతి విద్యార్థినిపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు ముగ్గురు దుర్మార్గులు.. మాయ మాటలు చెప్పి అమ్మాయిని ట్రాప్ చేసిన కామాంధులు.. నాలుగు నెలలుగా వారి పశువాంఛ తీర్చుకున్నారు.. నిందితుల్లో బాలిక అన్నయ్య (పెద్దమ్మ కొడుకు) కూడా ఉండడం సభ్యసమాజం తలదించుకునేలా ఉంది. మరో నిందితుడు మైనర్ కాగా.. బాలిక చదువుకునే స్కూల్‌లోనే 7వ తరగతిలో ఉన్నాడు..
Read Also: Heavy flood: గోదావరి బేసిన్‌లోని ప్రాజెక్టులకు భారీగా వరద
ఏలూరు జిల్లా మండవల్లిలో జరిగిన ఆ దారుణమైన ఘటనకు సంబంధించన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మండవల్లి బీసీ వసతి గృహంలో ఉంటూ ప్రభుత్వ జెడ్పీ పాఠశాలలో చదువుతున్న ఐదో తరగతి విద్యార్థినిపై ముగ్గురు సామూహిక అత్యాచారానికి పాల్పడుతూ వచ్చారు.. 4 నెలలుగా బాలికపై అత్యాచారం చేస్తూ వచ్చారు.. ముగ్గురిలో ఒకడు బాలుడు (మైనర్) కాగా.. బాలిక చదివే పాఠశాలలోనే 7వ తరగతి చదువుతున్నాడు.. ఇక, నిందితుల్లో ఒకరు బాలిక సొంత అన్నయ్య (పెద్దమ్మ కొడుకు) కూడా ఉండడం సభ్యసమాజం సిగ్గుపడేలా చేస్తోంది.. మరో వ్యక్తి మండవల్లి మండలం భైరవపట్నం చెందిన లారీ డ్రైవర్‌గా గుర్తించారు.. పోలీసుల అదుపులో ఇద్దరు నిందితులు ఉండగా.. ప్రధాన నిందితుడైన బాలిక అన్నయ్య కోసం గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు.