Site icon NTV Telugu

Ts Government: 5,950 మంది వీఆర్ఏలు నీటిపారుదల శాఖలోకి..

Ts Govt

Ts Govt

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ శాఖలోని 24 వేల మంది వీఆర్ఏల్లో 5,950 మందిని నీటి పారుదల శాఖలో లష్కర్లుగా నియమించుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వీరందరు రెవెన్యూ శాఖలో రూ.10.500 గౌరవ వేతనంపై తాత్కాలిక ఉద్యోగులుగా పని చేస్తున్నారు. వారి సేవలను అదేశాఖలో క్రమబద్దీకరించడంతో పాటు కొత్త పేస్కేల్ ను వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం.

Read Also: Tamota Price : రెండు వారాల్లో కిలో టమాట రూ.300?

వీఆర్ఏల అవసరాన్ని బట్టి వేర్వేరు శాఖల్లో వారిని విలీనం చేయాలని భావిస్తోంది. రూ. 19వేల మూల వేతనంతో పాటు మొత్తం రూ. 23 వేల స్థూల వేతనం ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 5,950 మంది వీఆర్ఏలతో పాటు శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల కింద నిర్వాసితులైన కుటుంబాల నుంచి దాదాపు 200 మందిని లష్కర్లుగా నియమించుకోవడానికి నీటిపారుదల శాఖ ప్రతిపాదనలు రెడీ చేసింది.

Read Also: Bonalu 2023 : బోనాల వేడుకలకు పటిష్ట బందోబస్తు

అయితే, ప్రాజెక్టుల కింద నిర్వాసితులుగా మారిన కుటుంబాలకు ఉద్యోగాలు కల్పించడానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జారీ చేసి జీవో 98 కింద 200 మందికి ఉద్యోగాలు ఇచ్చేందుకు కసరత్తు పూర్తైంది. త్వరలో సీఎం కేసీఆర్ సమీక్ష జరిపి లష్కర్ల నియామకంపై తుది నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. వీఆర్ఏలను లష్కర్లుగా నియమిస్తామని కేసీఆర్ చాలా ఏళ్ల క్రిందనే ప్రకటించారు.

Read Also: Wife Eloped: ప్రియుడితో వీడియో కాల్‌లో భార్య.. ఇంటికొచ్చి భర్త చూడగానే షాక్

సాగునీటి ప్రాజెక్టులు, కాల్వలు, తూములకు కాపలా కాస్తూ పంట పొలాలకు నీళ్లు అందేలా లష్కర్లు వర్క్ చేయాల్సి ఉంటుంది. కాల్వల్లో పిచ్చి మొక్కలు తొలగించడం, గండ్లు పడితే ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడం వంటి విధులు నిర్వహించనున్నారు. తెలంగాణ వచ్చాక కొత్త ప్రాజెక్టులను పెద్ద ఎత్తున నిర్మించినా, నిర్వహణకు అవసరమైన క్షేత్రస్థాయి సిబ్బందిని కేసీఆర్ ప్రభుత్వం నియమించలేదు. లష్కర్ల నియామకంతో కొత్త ప్రాజెక్టుల నిర్వహణ మెరుగుపడే ఛాన్స్ ఉంది.

Exit mobile version