NTV Telugu Site icon

AN-12 Plane Crash: 1968లో కూలిన సైనిక విమానం.. 56 ఏళ్ల తర్వాత 102 మందిలో 9 మృతదేహాలు లభ్యం!

An 12 Plane

An 12 Plane

56 ఏళ్ల క్రితం అంటే 1968లో భారత వైమానిక దళానికి చెందిన విమానం రోహ్‌తంగ్ పాస్‌లో ప్రమాదానికి గురైంది. విమానంలో 102 మంది ఉన్నారు. దీని శిధిలాలు 2003లో కనుగొన్నారు. నేటికీ మృతదేహాలను వెతికే పని కొనసాగుతోంది. ఇది దేశంలోనే అత్యంత సుదీర్ఘమైన రెస్క్యూ ఆపరేషన్. తాజాగా భారత సైన్యం ఇందులో మరి కొన్ని మృతదేహాలను కనుగొంది. హిమాచల్ ప్రదేశ్‌లోని ప్రమాద స్థలం నుంచి నాలుగు మృతదేహాలను స్వాధీనం చేసుకుంది. 7 ఫిబ్రవరి 1968న, AN-12 విమానం చండీగఢ్ నుంచి లేహ్‌కు బయలుదేరింది. కానీ కొంత సమయం తర్వాత అది కనిపించకుండా పోయింది. రోహ్‌తంగ్ పాస్‌కు సమీపంలో ప్రతికూల వాతావరణాన్ని ఎదుర్కొన్న తర్వాత విమానం కూలిపోయింది. బాధితుల మృతదేహాలు, అవశేషాలు దశాబ్దాలుగా మంచు ప్రాంతంలో కూరుకుపోయాయి. మరోవైపు డోగ్రా స్కౌట్స్ నేతృత్వంలో భారత సైన్యం సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగింది.

READ MORE: Alluri Sitaramaraju District: బాలింత కష్టంపై స్పందించిన ప్రభుత్వం.. రోప్ వే బ్రిడ్జి మంజూరు

అటల్ బిహారీ వాజ్‌పేయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మౌంటెనీరింగ్‌కు చెందిన పర్వతారోహకులు మొదటిసారిగా 2003లో శిథిలాలను కనుగొన్నారు. ఆ తర్వాత భారత సైన్యం, ప్రత్యేకించి డోగ్రా స్కౌట్‌లు అనేక ప్రయత్నాలు చేశారు. ప్రతికూల పరిస్థితులు, ప్రవేశించలేని భూభాగం ఉన్నప్పటికీ.. సైట్ నుంచి 2019 వరకు కేవలం ఐదు మృతదేహాలను మాత్రమే స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు మరో నాలుగు మృతదేహాలను వెలికితీయడంతో మొత్తం సంఖ్య తొమ్మిదికి చేరుకుంది. బయటపడిన నాలుగు మృతదేహాల్లో ముగ్గురిని గుర్తించారు.

READ MORE: MUDA Scam: ముడా స్కామ్లో కీలక పరిణామం.. భూమిని తిరిగి ఇచ్చేస్తానన్న సీఎం భార్య..

మృతదేహాలను ఎలా గుర్తించారు?
మల్ఖాన్ సింగ్, కానిస్టేబుల్ నారాయణ్ సింగ్, థామస్ చరణ్ అనే ముగ్గురు మృతదేహాలను గుర్తించారు. ఆయన జేబులో దొరికిన వోచర్ ద్వారా మల్ఖాన్ సింగ్ (పయనీర్)ని గుర్తించారు. కానిస్టేబుల్ నారాయణ్ సింగ్ (ఆర్మీ మెడికల్ కార్ప్స్) జేబులో దొరికిన పేబుక్ నుంచి గుర్తించబడింది. అదేవిధంగా.. కార్ప్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీర్స్ (EME)కి చెందిన థామస్ చరణ్ కూడా ఆయన పేబుక్ నుంచి గుర్తించారు. నాలుగో మృతదేహాన్ని ఎవరిదన్న దానిపై చర్యలు కొనసాగుతున్నాయి. అక్టోబర్ 10 వరకు సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుందని సైన్యం తెలిపింది.