Site icon NTV Telugu

Buggana Rajendranath Reddy: బుగ్గన రాజేంద్రనాథ్ సమక్షంలో వైసీపీలో చేరిన 500 ముస్లిం కుటుంబాలు

Buggana Rajendranath Reddy

Buggana Rajendranath Reddy

Buggana Rajendranath Reddy: నంద్యాల జిల్లా డోన్‌లో ముస్లిం సోదరుల ఇఫ్తార్ విందులో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పాల్గొన్నారు. బుగ్గన రాజేంద్రనాథ్ సమక్షంలో 500 ముస్లిం కుటుంబాలు వైసీపీలో చేరాయి. టీడీపీ, జనసేన, బీజేపీతో పాటు కేఈ, కోట్ల ఒక్కటైయ్యారని.. కేఈ, కోట్ల కుటుంబాలు కలవడం అభివృద్ధా అని ఆయన పేర్కొన్నారు. ప్రజలకేం జరిగినా మీరు అభివృద్ధి చెందడమే అభివృద్ధా అంటూ మంత్రి ప్రశ్నించారు. ఓట్ల కోసం బీజేపీతో చెలిమి చేసి అధికారం కోసం మైనార్టీలను వదిలేసిన వ్యక్తిత్వం చంద్రబాబుది అంటూ ఆయన విమర్శించారు. చంద్రబాబు వల్లే ఏప్రిల్‌లో జరగాల్సిన ఎన్నికలు మే నెలకు మారాయన్నారు. అల్లా దయతోనే డోన్ నియోజకవర్గం అభివృద్ధి చేసుకున్నామని మంత్రి రాజేంద్రనాథ్ రెడ్డి పేర్కొన్నారు. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే ఓటేయమని రాజకీయ నాయకుడిని ఎక్కడైనా చూశారా అంటూ మంత్రి తెలిపారు. సైకిల్ బయట ఉండాలి ఫ్యాన్ ఇంట్లో ఉండాలి గ్లాస్ సింక్‌లో ఉండాలన్న సీఎం నినాదం మర్చిపోవద్దని కోరారు.

 

Exit mobile version