Sexual Assault: 500 మంది అమ్మాయిలను వేధించిన ప్రొఫెసర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాలేజీలో ఓ ప్రొఫెసర్ లైంగిక వేధింపులపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి, సీఎంకి వందలాది మంది విద్యార్ధినులు లేఖ రాయడం తీవ్ర కలకలం రేపుతుంది. హరియాణాలోని సిర్సాకు చెందిన 500 మంది మహిళా కళాశాల విద్యార్థినులు చౌదరి దేవిలాల్ యూనివర్సిటీలో ఒక ప్రొఫెసర్‌పై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ లేఖ రాశారు. వెంటనే ఆయనను సస్పెండ్ చేయాలని, హైకోర్టు రిటైర్డ్ జడ్జ్ నేతృత్వంలో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ రాసిన లేఖ ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Read Also: Chlorine Gas Leak: ఉత్తరఖండ్‌లో క్లోరిన్ గ్యాస్ లీక్.. తప్పిన పెను ప్రమాదం!
Also Read
- Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
- Smriti Mandhana: పరుగుల రారాణి స్మృతి మంధాన.. టీ20 క్రికెట్లో అరుదైన ఘనత..!
- Haribabu Murder Case: యూట్యూబర్ వైష్ణవి భర్త హత్య కేసులో కీలక పరిణామం.. మరో నలుగురి పాత్రపై దర్యాప్తు..!
- T20I Rankings: ఆఫ్ఘనిస్తాన్ పై క్లీన్ స్వీప్ చేసినా.. నెం.1 ర్యాంక్ కోల్పోయిన టీమిండియా..!
అయితే, ఈ లేఖ కాపీలను యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ అజ్మేర్ సింగ్ మాలిక్, హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఆ రాష్ట్ర హోం మంత్రి అనిల్ విజ్, జాతీయ మహిళా కమిషన్ ఛైర్మన్ రేఖా శర్మ సహ ప్రభుత్వ అధికారులు దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందిత ప్రొఫెసర్ అసభ్యకరమైన చర్యలకు పాల్పడుతున్నాడని సదరు విద్యార్థినీలు ఆరోపించారు. తన ఛాంబర్ కు అమ్మాయిలను పిలిపించి.. బాత్‌రూమ్‌లోకి తీసుకెళ్లి ‘ప్రైవేట్ భాగాలను తాకడంతో పాటు దారుణంగా వ్యవహరిస్తున్నాడని స్టూడెంట్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Read Also: Praja Palana: నడిరోడ్డుపై ప్రజా పాలన దరఖాస్తులు.. బైక్‌పై తరలిస్తోన్న క్రమంలో..
ఇక, ప్రొఫెసర్ చర్యలను అడ్డుకుంటే చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయని బెదిరింపులకు దిగుతున్నాడని వాపోయారు. ఇది చాలా రోజుల నుంచి జరుగుతుందనే విషయాన్ని కాలేజ్ యాజమాన్యానికి తెలిపిన తమకు సహకరించలేదన్నారు.. ఎక్సామ్స్, ప్రాక్టికల్ పరీక్షల్లో మెరుగైన మార్కులు పేరుతో వైస్ ఛాన్సలర్ పై కూడా వచ్చిన ఆరోపణలను అణిచివేసేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తుంది. ఇక, యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ రాజేష్ కుమార్ బన్సాల్ అజ్ఞాత లేఖ అందినట్లు ధ్రువీకరించారు. దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నట్లు పేర్కొన్నారు. యూనివర్శిటీకి దాని సొంత కమిటీ ఉంది.. ఈ ఆరోపణలపై ఎంక్వైరీ చేస్తామన్నారు.. దోషులు ఎవరైనా తప్పించుకోరన్నారు. సంబంధిత సీసీటీవీ ఫుటేజీని పోలీసులకు అందజేసినట్లు రిజిస్ట్రార్ చెప్పారు. కానీ, ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రొఫెసర్ ఇప్పటికే తన ఛాంబర్ లోని సీసీటీవీ ఫుటేజీ నుంచి విద్యార్ధినులతో తన అసభ్యకరమైన వీడియోను తొలగించిందని లేఖలో పేర్కొన్నారు.
తాజావార్తలు
-
IBPS RRB 2026: నిరుద్యోగులకు అలర్ట్.. 13,441 బ్యాంక్ ఉద్యోగాలు.. IBPS RRB దరఖాస్తులకు రేపే చివరి తేదీ
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
The Vvaan: 400 ఏళ్ల ఆలయంలో సిద్ధార్థ్, తమన్నా ప్రత్యేక పూజలు.. గుడి మిస్టరీతోనే వస్తున్న కొత్త సినిమా
-
Smriti Mandhana: పరుగుల రారాణి స్మృతి మంధాన.. టీ20 క్రికెట్లో అరుదైన ఘనత..!
-
Irumudi OTT: ఓటీటీలోనూ దుమ్మురేపుతున్న ‘ఇరుముడి’.. నెట్‌ఫ్లిక్స్‌లో నెం.1గా ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!