NTV Telugu Site icon

Sexual Assault: 500 మంది అమ్మాయిలను వేధించిన ప్రొఫెసర్..

Haryana

Haryana

కాలేజీలో ఓ ప్రొఫెసర్ లైంగిక వేధింపులపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి, సీఎంకి వందలాది మంది విద్యార్ధినులు లేఖ రాయడం తీవ్ర కలకలం రేపుతుంది. హరియాణాలోని సిర్సాకు చెందిన 500 మంది మహిళా కళాశాల విద్యార్థినులు చౌదరి దేవిలాల్ యూనివర్సిటీలో ఒక ప్రొఫెసర్‌పై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ లేఖ రాశారు. వెంటనే ఆయనను సస్పెండ్ చేయాలని, హైకోర్టు రిటైర్డ్ జడ్జ్ నేతృత్వంలో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ రాసిన లేఖ ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Read Also: Chlorine Gas Leak: ఉత్తరఖండ్‌లో క్లోరిన్ గ్యాస్ లీక్.. తప్పిన పెను ప్రమాదం!

అయితే, ఈ లేఖ కాపీలను యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ అజ్మేర్ సింగ్ మాలిక్, హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఆ రాష్ట్ర హోం మంత్రి అనిల్ విజ్, జాతీయ మహిళా కమిషన్ ఛైర్మన్ రేఖా శర్మ సహ ప్రభుత్వ అధికారులు దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందిత ప్రొఫెసర్ అసభ్యకరమైన చర్యలకు పాల్పడుతున్నాడని సదరు విద్యార్థినీలు ఆరోపించారు. తన ఛాంబర్ కు అమ్మాయిలను పిలిపించి.. బాత్‌రూమ్‌లోకి తీసుకెళ్లి ‘ప్రైవేట్ భాగాలను తాకడంతో పాటు దారుణంగా వ్యవహరిస్తున్నాడని స్టూడెంట్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Read Also: Praja Palana: నడిరోడ్డుపై ప్రజా పాలన దరఖాస్తులు.. బైక్‌పై తరలిస్తోన్న క్రమంలో..

ఇక, ప్రొఫెసర్ చర్యలను అడ్డుకుంటే చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయని బెదిరింపులకు దిగుతున్నాడని వాపోయారు. ఇది చాలా రోజుల నుంచి జరుగుతుందనే విషయాన్ని కాలేజ్ యాజమాన్యానికి తెలిపిన తమకు సహకరించలేదన్నారు.. ఎక్సామ్స్, ప్రాక్టికల్ పరీక్షల్లో మెరుగైన మార్కులు పేరుతో వైస్ ఛాన్సలర్ పై కూడా వచ్చిన ఆరోపణలను అణిచివేసేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తుంది. ఇక, యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ రాజేష్ కుమార్ బన్సాల్ అజ్ఞాత లేఖ అందినట్లు ధ్రువీకరించారు. దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నట్లు పేర్కొన్నారు. యూనివర్శిటీకి దాని సొంత కమిటీ ఉంది.. ఈ ఆరోపణలపై ఎంక్వైరీ చేస్తామన్నారు.. దోషులు ఎవరైనా తప్పించుకోరన్నారు. సంబంధిత సీసీటీవీ ఫుటేజీని పోలీసులకు అందజేసినట్లు రిజిస్ట్రార్ చెప్పారు. కానీ, ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రొఫెసర్ ఇప్పటికే తన ఛాంబర్ లోని సీసీటీవీ ఫుటేజీ నుంచి విద్యార్ధినులతో తన అసభ్యకరమైన వీడియోను తొలగించిందని లేఖలో పేర్కొన్నారు.