Robbery: తనిష్క్లో భారీ చోరీ.. రూ.50 కోట్ల విలువైన నగలు అపహరణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడులోని మదురైలో భారీ చోరీ కలకలం రేపింది. పళంగనాథం ప్రాంతంలోని ప్రముఖ జువెలరీ బ్రాండ్ తనిష్క్ షోరూమ్‌లో దుండగులు అత్యంత చాకచక్యంగా ప్రవేశించి సుమారు రూ. 50 కోట్ల విలువైన బంగారం, వజ్రాభరణాలను దోచుకెళ్లారు. 15 నుంచి 20 కిలోల వరకు బంగారం చోరీకి గురైనట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఈ షోరూమ్ భవన నిర్మాణ పనులు సుమారు 70 శాతం మాత్రమే పూర్తయ్యాయి. కేవలం 10 నుంచి 15 రోజుల క్రితమే ఈ నూతన షోరూమ్‌ను ప్రారంభించారు. ఈ నేపథ్యంలో బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ దోపిడీ జరిగినట్లు తెలుస్తోంది. షోరూమ్ వెనుక వైపు తలుపులు, షట్టర్ తాళాలను పగలగొట్టడంతో పాటు షాపు గోడకు కన్నం వేసి దొంగతనానికి పాల్పడినట్లు నిర్వాహకులు గుర్తించారు.
11వ తేదీ ఉదయం సిబ్బంది షోరూమ్‌కు తిరిగి వచ్చినప్పుడు తలుపులు పగలగొట్టి ఉండటాన్ని గమనించి లోపలికి వెళ్లి చూడగా, ఆభరణాలు మాయమైనట్లు తేలింది. వెంటనే షోరూమ్ నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.
Also Read
- KTM X-Bow Arrow: KTM నుంచి కొత్త ఆఫ్‌రోడ్ వాహనం.. 500 యూనిట్లే, ధర రూ.92.4 లక్షలు
- Bangladesh: బంగ్లాదేశ్‌లో మళ్లీ అరాచకం.. హసీనా రాకముందే బాంబు దాడులు, ఆందోళనలు!
- UP Elections: యూపీలో ఒవైసీ-చంద్రశేఖర్ పొత్తు.. బీజేపీ హ్యాపీ, అఖిలేష్లో టెన్షన్.!
- Minister Ponguleti: 22A బాధితులకు గుడ్‌న్యూస్.. కలెక్టర్లకు మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు..
పోలీసులు షోరూమ్‌లోని సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అందులో ఒకే ఒక్క అనుమానితుడు భవనం పైఅంతస్తులోని లిఫ్ట్ మార్గం (లిఫ్ట్ ప్యాసేజ్) ద్వారా లోపలికి ప్రవేశించినట్లు రికార్డయింది. కొత్తగా ప్రారంభమైన షోరూమ్‌లో నిర్మాణ పనులు ఇంకా కొనసాగుతుండటాన్ని ఆసరాగా చేసుకుని దొంగ ఈ పథకం వేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. చోరీకి గురైన బంగారం, వజ్రాల కచ్చితమైన పరిమాణం, విలువపై పూర్తి స్పష్టత రావాల్సి ఉంది. నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.
తాజావార్తలు
-
Robbery: తనిష్క్లో భారీ చోరీ.. రూ.50 కోట్ల విలువైన నగలు అపహరణ..
-
KTM X-Bow Arrow: KTM నుంచి కొత్త ఆఫ్‌రోడ్ వాహనం.. 500 యూనిట్లే, ధర రూ.92.4 లక్షలు
-
Bangladesh: బంగ్లాదేశ్‌లో మళ్లీ అరాచకం.. హసీనా రాకముందే బాంబు దాడులు, ఆందోళనలు!
-
Big Rain Alert: బంగాళాఖాతంలో మరో తుఫాన్ ముప్పు.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన..
-
North Korea: అమెరికా దెబ్బకు వణికిపోతున్న కిమ్.. 54 ఏళ్ల తర్వాత రాజ్యాంగం మార్చి సంచలన నిర్ణయం!
ట్రెండింగ్
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్..!
-
ICC కీలక నిర్ణయాలపై ఉత్కంఠ.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో కీలక మార్పులు.. 12 జట్లతో ప్లాన్.?
-
Moringa Soup: ఖరీదైన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వద్దు.. వింటర్లో బుగ్గలపై సహజమైన ఎరుపుదనం తెచ్చే సూప్ ఇదే..
-
Cigarette Prices Hike: ధూమపాన ప్రియులకు షాక్.. మరోసారి సిగరెట్ల ధరల బాదుడు..! ఒక్క ప్యాకెట్‌పై ఏకంగా..
-
Kusal Mendis: విమర్శకుల నోళ్లు మూయించిన కుశాల్ మెండిస్.. 13,000 పరుగుల మైలురాయిని అందుకున్న ఆటగాడిగా ఘనత..!