Heavy Weight Girl: వయసు 5ఏళ్లు.. బరువు 45కిలోలు.. తిండి పెట్టలేక తాళం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Heavy Weight Girl: పాప వయసు 5ఏళ్లు.. బరువు మాత్రం 45కిలోలు. ఆ పాప సాధారణం కంటే చాలా ఎక్కువ ఆహారం తీసుకుంటుంది. ఎంత తిన్న తర్వాత కూడా తాను ఆకలితో అలమటిస్తూనే ఉంటుంది. దీంతో ఆ పాప తల్లి వంటగదికి తాళం వేయవలసి వచ్చింది. కారణం.. అప్పుడైనా తన కుమార్తె ఎక్కువ తినలేదని ఆ తల్లి ఆలోచన. వివరాల్లోకి వెళితే. యూకేలో నివసిస్తున్న 25 ఏళ్ల హోలీ విలియమ్స్ కుమార్తె హార్లో అరుదైన వ్యాధితో బాధపడుతుంది. ఈ వ్యాధి పేరు ప్రేడర్ విల్లీ సిండ్రోమ్. దీని కారణంగా, 5 ఏళ్ల హార్లో సుమారు 45 కిలోల బరువు పెరిగింది. హార్లో ఎంత తిన్నా మళ్లీ ఆకలితో ఉంటుంది. ఎప్పుడూ తినాలనే అనిపిస్తోంది తనకు. ఇలా బాలిక బరువు పెరగడానికి గల కారణాలను వైద్యులు వెల్లడించారు.

Also Read
హార్లో ఆకలిని నియంత్రించే క్రోమోజోమ్ కలిగి లేదని వైద్యులు చెప్పారు. ఈ అరుదైన వ్యాధి వల్ల ఎంత తిన్నా కడుపు నిండదు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇది అరుదైన జన్యుపరమైన వ్యాధి.. యూకేలో జన్మించిన ప్రతి 15,000 మంది పిల్లలలో ఒకరిలో కనిపిస్తుంది. దీనికి నివారణ లేదు. ముందుజాగ్రత్త ఒక్కటే రక్షణ. దీనికి సంబంధించి పీడియాట్రిక్స్ జర్నల్‌లో రీసెర్చ్ పేపర్ ఇటీవల ప్రచురితమైంది. స్థూలకాయంతో బాధపడుతున్న చిన్నారుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందని.. ఇందులో 6 నుంచి 11 ఏళ్లలోపు చిన్నారులు ఉన్నారని తెలిపారు. దీని వెనుక చెడు ఆహారమే కారణమని చెప్పారు.
Read Also: Dead Body In Truck: లారీలో డెడ్ బాడీ.. షాక్‌కు గురైన ఓనర్
తాజావార్తలు
-
Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
-
Story Board : నేపాల్ ఆకస్మిక వరదలకు కారణాలేంటి..? చైనా నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది..?
-
OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
-
OTR: ఆ నేతకు పీఏ పోట్లు.. ఆ ఎమ్మెల్యే చుట్టూ నడుస్తున్న అసలు డ్రామా!
-
OTR: సొంత పార్టీ నేతలకే టార్గెట్ అవుతున్న తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!